న్యూఢిల్లీ: రెండో దఫా సరోగసీ ద్వారా బిడ్డ ను కనేందుకు చట్టం అడ్డు తగులుతున్న నేపథ్యంలో ఈ అంశాన్ని పరిశీలించేందుకు సుప్రీంకోర్టు ముందుకొచ్చింది. ఇప్పటికే సాధారణంగా లేదా దత్తత లేదా సరోగసీ ద్వారా భార్యాభర్తలకు ఒక బిడ్డ ఉంటే మరో బిడ్డను సరోగసీ ద్వారా పొందేందు కు చట్టం ఒప్పుకోదు. దీంతో రెండో బిడ్డ నూ సరోగసీ ద్వారా కనేందుకు అవకాశం ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్‌ను పరిశీ లించేందుకు జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్.మహదేవన్‌ల ధర్మాసనం అంగీకారం తెలిపింది.
పౌరుల సంతాన భాగ్య హక్కు లను ప్రభుత్వాలు ఏ విధంగా సరోగసీ వంటి చట్టాల ద్వారా అడ్డుకోగలవు? అనే కోణంలో కేసును పరిశీలించాలని ధర్మా సనం నిర్ణయించింది. అయితే జనభారతంగా దేశం మారిన నేపథ్యంలో అధిక సంతా నం కట్టడి ఉద్దేశంతోనే ప్రభుత్వాలు ఇలా రెండో సరోగసీ బిడ్డకు అడ్డు చెబుతున్నా యని, ఈ కోణంలో తాము ప్రభుత్వంతో ఏకీభవిస్తున్నామని జస్టిస్ నాగరత్న వ్యాఖ్యానించారు. అయితే పౌరుల వ్యక్తిగత జీవితాలు, తమ వారసుల పుట్టుక నిర్ణయా లపై ప్రభుత్వం జోక్యం చేసుకోజాలదని లాయర్ వాదించారు.
ఇదీ చదవండి : ఘనంగా బిర్లా వారసుడి పెళ్లి, సెలబ్రిటీల సందడి
స్కిన్ కేర్‌పై క్రికెటర్ ప్రశ్న, ప్రధాని మోదీ సమాధానం ఏంటో తెలుసా?


