2027లో సుప్రీంకోర్టు చరిత్రలోనే రికార్డు సృష్టించనున్నది ఎవరో తెలుసా?
భారత 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు, ఆరు నెలలు పాటు నవంబర్ 23 దాకా ఆయన సీజేఐగా సేవలందిస్తారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆయనతో రాష్ట్రపతి ద్రౌపదీముర్ము ప్రమాణం చేయించారు. జస్టిస్ గవాయ్ ప్రస్తుత సిజెఐ సంజీవ్ ఖన్నా మాదిరిగానే ఆరు నెలల పాటు అత్యున్నత న్యాయాధికారిగా సేవలందిస్తారు. ఇంతకంటే తక్కువ రోజులు పదవిలో ఉన్న ప్రధాన న్యాయమూర్తుల గురించి తెలుసు కుందాం.జస్టిస్ బీవీ నాగరత్న ఘనతభారత సుప్రీంకోర్టు స్థాపించి 75 ఏళ్లు పూర్తయ్యాయి. ప్రధాన న్యాయమూర్తి పదవి ఇంతవరకు ఏ మహిళకు దక్కలేదు. కానీ ప్రముఖ న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్న 2027లో భారతదేశపు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా రికార్డు సృష్టించనున్నారు. ఆమె పదవీకాలం కేవలం 36 రోజులు మాత్రమే. 2027, సెప్టెంబర్ 25 నుండి అక్టోబర్ 30 వరకు మాత్రమే ఆమె ఈ పదవిలో ఉన్నారు. అయితే ఇదే తక్కువ కాదు. అత్యల్ప కాలం సీజేఐగా పనిచేసిన వారు జస్టిస్ కమల్ నారాయణ్ సింగ్. ఆయన పదవీకాలం కేవలం 17 రోజులు మాత్రమే.సుప్రీంకోర్టులో ఒక మహిళా న్యాయమూర్తిగా అత్యధిక కాలం అంటే 6 సంవత్సరాల 2 నెలల పాటు పనిచేసిన తర్వాత బివి నాగరత్న 54వ సిజెఐగా ఆమె పదవీకాలం కేవలం 36 రోజులు మాత్రమే ఉండనుంది. సెప్టెంబర్ 27, 2027న రికార్డులు మీద రికార్డు సృష్టించనున్నారు జస్టిస్ బీవీ నాగరత్న.75 సంవత్సరాల చరిత్రలో భారతదేశపు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి అవుతారు. సుప్రీంకోర్టులో మహిళా న్యాయమూర్తిగా అత్యధిక కాలం అంటే ఆరు సంవత్సరాల రెండు నెలలు పనిచేసిన రికార్డుఅంతేకాదు ఆమె తండ్రి జస్టిస్ ఇఎస్ వెంకటరామయ్య 19వ సీజేఐగా పనిచేశారు. ఈ నేపథ్యంలో భారతదేశ చరిత్రలో భారతదేశ ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేసిన తొలి తండ్రీ బిడ్డలుగా నిలవనున్నారు. 2008లో జస్టిస్ బీవీ నాగరత్నకర్ణాటక హైకోర్టుకు ఎంపికయ్యారు. 2021 ఆగస్టులో సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందారు. మరిన్ని విశేషాలుఅత్యధిక కాలం పనిచేసింది జస్టిస్ యశ్వంత్ విష్ణు చంద్రచూడ్ భారత ప్రధాన న్యాయమూర్తిగా 7 సంవత్సరాల 139 రోజులు పనిశారు. అత్యంత తక్కువ రోజులు పనిచేసిన వారిలో కమల్నారాయణ్ సింగ్ తరువాత జస్టిస్ ఎస్ రాజేంద్ర బాబు నిలుస్తారు. రాజేంద్ర బాబు పదవీకాలు 29 రోజులు . సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం సీనియారిటీ నియమాన్ని అలాగే పాటిస్తే, జస్టిస్ బివి నాగరత్న మేడో అతి తక్కువ పదవీకాలం అంటే 36 రోజులు సేవలందించే అవకాశం ఉంది.ఇప్పటివరకు భారతదేశంలోని 51 మంది 11 మంది చీఫ్ జస్టిస్లలో అందరూ పురుషులే. 11 మంది మహిళలు మాత్రమే సుప్రీంకోర్టులో న్యాయమూర్తులుగా పనిచేశారు.సీనియారిటీకి అనుగుణంగా న్యాయమూర్తులను పదోన్నతి కల్పించాలనే అలిఖిత నియమాన్ని అనుసరిస్తుంది. ఈ నియమం ప్రకారం, సాధారణంగా, పరిశీలనలో ఉన్న న్యాయమూర్తులలో, సీనియర్ న్యాయమూర్తిని అత్యున్నత న్యాయస్థానానికి ఎంపిక చేస్తారు. అదేవిధంగా, సీనియర్ న్యాయమూర్తి ప్రధాన న్యాయమూర్తి అవుతారు. ఇతర నియమిత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల పదవీకాలం కూడా కేవలం ఆరు నెలల నుండి ఒక సంవత్సరం వరకు ఉంటుంది. ఈనేపథ్యంలో మాజీ చీఫ్ జస్టీస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్ ఎనిమిది మంది ప్రధాన న్యాయమూర్తులను హైకోర్టులకు నియమించారు. వారిలో ప్రధాన న్యాయమూర్తి రాజీవ్ శక్తిధర్ హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు నుండి కేవలం 24 రోజుల తర్వాత పదవీ విరమణ చేశారు.అయితే ఇటీవలి కాలంలో సుప్రీంకోర్టు మరియు హైకోర్టులలో ప్రధాన న్యాయమూర్తుల పదవీకాలంపై చర్చ మొదలైంది.భారత 40వ ప్రధాన న్యాయమూర్తి పళనిసామి గౌండర్ సదాశివం, CJIల స్వల్ప పదవీకాలంపై స్పందించారు. "నేను చేయాలనుకున్నవి చాలా ఉన్నాయి కానీ (నా) స్వల్ప పదవీకాలం కారణంగా చేయలేకపోయాను" అని పదవీ విరమణకు రెండు రోజుల ముందు వ్యాఖ్యానించడం గమనార్హం. ఈయన దాదాపు తొమ్మిది నెలలపాటు పదవిలో ఉన్నారు. ప్రధాన న్యాయమూర్తులకు స్థిరమైన పదవీకాలం అవసరమని భావించారు.సెప్టెంబర్ 2024లో జస్టిస్ హిమా కోహ్లీ పదవీ విరమణ చేసిన తర్వాత, సుప్రీంకోర్టులో మహిళా న్యాయ మూర్తుల సంఖ్య 34 మందిలో ఇద్దరు మాత్రమే మహిళలు. ప్రస్తుతం, జస్టిస్ బీవీ నాగరత్న , జస్టిస్ బేలాఎం త్రివేది మాత్రమే సుప్రీంకోర్టులో మహిళా న్యాయమూర్తులు. 1989లో సుప్రీంకోర్టుకు నియమితులైన మొదటి మహిళా న్యాయమూర్తిగా జస్టిస్ ఫాతిమా బీవీ చరిత్ర సృష్టించారు, కానీ ఆమె సుప్రీంకోర్టుకు ఎంపికైన మహిళా న్యాయమూర్తులలో రెండున్నర సంవత్సరాల అతి తక్కువ పదవీకాలం పనిచేశారు.ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025 ప్రకారం, హైకోర్టు న్యాయమూర్తులలో 14శాతం మంది మహిళలు ఉన్నారు. సీనియారిటీ నియమాన్ని అలాగే పాటిస్తే రాబోయే కొన్ని సంవత్సరాలలో ఉన్నత న్యాయస్థానంలో మహిళల ప్రాతినిధ్యం మరింత పెరుగుతుందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నే.