పని అడిగితే తప్పు కాదు కదా?

Eesha Rebba Special Interview About Subramaniapuram - Sakshi

‘‘సుబ్రహ్మణ్యపురం’ కథని డైరెక్టర్‌ సంతోష్‌ రెండు గంటలు చెప్పారు. కథ వింటున్నప్పుడు నేను విజువలైజ్‌ చేసుకున్నాను. అది నాకు బాగా నచ్చింది. అందుకే ఈ చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చా. అన్ని రకాల సినిమాలు చూస్తాను. సస్పెన్స్‌ థ్రిల్లర్స్‌ అంటే నాకు చాలా ఇష్టం. నెక్ట్స్‌ ఏమవుతుంది? అని టెన్షన్‌ పడుతూ సినిమాలు చూడటం నాకు ఇష్టం. ఆ ఎలిమెంట్స్‌ ‘సుబ్రహ్యణ్యపురం’లో చాలా ఉన్నాయి’’ అని ఈషా రెబ్బ అన్నారు.

సుమంత్, ఈషా రెబ్బ జంటగా సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సుబ్రహ్యణ్యపురం’. బీరం సుధాకర రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ రోజు విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఈషా మాట్లాడుతూ– ‘‘ఊరంటే చాలా ఇష్టపడే అమ్మాయి పాత్ర నాది. ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. అందులోనూ తండ్రి అంటే మరింత ఇష్టం. ఈ చిత్రంలో లవ్‌ స్టోరీ ఉంటుంది. కానీ అది థ్రిల్లర్‌ అనుభూతికి అడ్డుకాదు. నేను భక్తురాలిగా కనిపిస్తాను.

సుమంత్‌ కంప్లీట్‌గా నాకు ఆపోజిట్‌ రోల్‌ ప్లే చేశారు. దేవుడు ఉన్నాడని నమ్మే అమ్మాయికి, దేవుడిపై రీసెర్చ్‌ చేసే అబ్బాయికి మధ్య లవ్‌ ఫీల్‌ ఎలా కలిగింది? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌. నాకు వచ్చిన కథలలో నాకు నచ్చినవి ఎంచుకుంటున్నాను. కొత్త దర్శకులతో, కొత్త కాంబినేషన్స్‌లో వర్క్‌ చేయాలని ఉంటుంది. నేనే అలాంటి పాత్రలు కోసం అప్రోచ్‌ అవుతాను.. పని అడగటంలో తప్పు లేదు కదా? తెలుగు అమ్మాయిలకు ఇప్పుడిప్పుడే అవకాశాలు పెరుగుతున్నాయి. ‘సుబ్రహ్మణ్యపురం’ సినిమా నాకు చాలా ప్రత్యేకం’’ అన్నారు.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top