అతను నటిస్తే నేను తప్పుకుంటా..!

Dwayne The Rock Johnson and Tyrese Gibsons Feud - Sakshi

హాలీవుడ్‌ మోస్ట్‌ సక్సెస్‌ ఫుల్‌ సిరీస్‌ ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌లో ప్రధాన పాత్రధారి టైరెస్‌ గిబ్సన్‌ చిత్ర నిర్మాతలకు వార్నింగ్‌ ఇచ్చాడు. త్వరలో ఈ సిరీస్‌లో 9వ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లనున్న నేపథ్యంలో గిబ్సన్‌ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. తాజా ఎడిషన్‌ లో హాలీవుడ్‌ యాక్షన్‌ హీరో డ్వేన్‌ జాన్సన్‌ కీలక పాత్రలో నటించే అవకాశం ఉందన్న వార్తలు కొద్ది రోజులుగా వినిపిస్తున్నాయి. అదే జరిగితే తాను ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌ సిరీస్‌ నుంచి తప్పుకుంటానని తెలిపాడు.

ఈ 9వ ఎడిషన్‌ ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉండగా చిత్రయూనిట్‌ సినిమాను ఏడాదిపాటు వాయిదా వేశారు. వాయిదా విషయాన్ని ప్రకటించిన సమయంలో కూడా గిబ్సన్‌ అసహనం వ్యక్తం చేశారు. జాన్సన్‌ను ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌ యూనిట్‌ తప్పకుండా తీసుకోవాలని భావిస్తే అది ఈ చిత్రం నుంచి నేను తప్పుకొని తనకు మరిన్ని కొత్త పాత్రలు చేయడానికి వారు ఇచ్చిన అవకాశం గా భావిస్తానన్నారు. ఈ వివాదంపై ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌ నిర్మాతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top