
త్వరలో బుల్లితెరపై దేవిశ్రీ ఆట.. పాట
ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఇటీవల యూఎస్‌ఏ (అమెరికా)లో నిర్వహించిన ‘డీఎస్‌పీ యూఎస్‌ఏ వరల్డ్ ప్రీమియర్ ఈవెంట్’ ని...
ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఇటీవల యూఎస్‌ఏ (అమెరికా)లో నిర్వహించిన ‘డీఎస్‌పీ యూఎస్‌ఏ వరల్డ్ ప్రీమియర్ ఈవెంట్’ ని తమ చానల్‌లో త్వరలో ప్రసారం చేయనున్నట్లు జీ తెలుగు టీవీ ప్రతినిధి తెలిపారు.
అమెరికాలోని పలు ప్రాంతాల్లో విభిన్నమైన సంగీతం, విలక్షణమైన ప్రదర్శనలతో జరిగిన ఈ మెగా ఈవెంట్‌ని ‘డోల్బీ అట్మాస్’ సిస్టమ్‌లో ఈ శనివారం హైదరాబాద్ లోని ప్రసాద్ ఐమాక్స్‌లో ప్రీమియర్‌గా ప్రదర్శిస్తున్నారు. ఇటీవల ‘కొంచెం టచ్‌లో ఉంటే చెప్తా’ కార్యక్రమంలో దేవిశ్రీ అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పిన విజేత లకు దేవిశ్రీని కలుసుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు.