శ్రుతీహాసన్‌ ప్లేస్‌లో..?

 Disha Patani to replace Shruthi Haasan in sangamithra

‘సంఘమిత్ర’ నుంచి శ్రుతీహాసన్‌ తప్పుకున్నాక ఆ ప్లేస్‌ని రీప్లేస్‌ చేసే తార ఎవరు? అనే చర్చ జరుగుతోంది. కచ్చితంగా ఆ స్థాయి హీరోయిన్‌నే తీసుకుంటారని చాలామంది భావించారు. అందుకే, అప్‌ కమింగ్‌ హీరోయిన్‌ దిశా పాట్నీని తీసుకోవాలనుకుంటున్నారనే వార్త విని, ఆశ్చర్యపోతున్నారు. ఒకవేళ ఈ వార్త నిజమైతే దిశా బంపర్‌ ఆఫర్‌ కొట్టేసినట్లే.

తెలుగులో ‘లోఫర్‌’, హిందీలో ‘ఎం.ఎస్‌. ధోని: ది అన్‌టోల్డ్‌ స్టోరీ’, చైనీస్‌ మూవీ ‘కుంగ్‌ ఫూ యోగా’ చేశారు దిశా. ప్రస్తుతం ‘భాగీ’ అనే హిందీ చిత్రం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 250 కోట్ల ప్రాజెక్ట్‌ ‘సంఘమిత్ర’లో అవకాశం దక్కితే దిశా రొట్టె విరిగి నేతిలో పడ్డట్లే. సుందర్‌. సి. దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top