ఈమె తల్లిదండ్రులు ఇద్దరూ స్టార్సే. దీంతో ఈమె కూడా పెరిగి పెద్దయ్యాక ఇండస్ట్రీలోకి వచ్చింది. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు చేస్తోంది. రీసెంట్‌గానే సూపర్‌స్టార్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇప్పుడు స్కూల్ డ్రస్సులో కనిపిస్తోంది. మరి ఇన్ని హింట్స్ ఇచ్చాం కదా! ఈమె ఎవరో కనిపెట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?
పైన స్కూల్ డ్రస్సులో మధ్యలో ఉన్న కూర్చుని పాప పేరు శ్రుతి హాసన్. తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ కూతురిగా ఈమె అందరికీ తెలుసు. ఈమె తల్లి సారిక కూడా నటి. తండ్రి కమల్ 'హే రామ్' మూవీలో బాలనటిగా శ్రుతి హాసన్ నటించింది. అలా తొలిసారి స్క్రీన్‌పై మెరిసింది. మరోవైపు టీనేజీలోకి వచ్చిన తర్వాత మ్యూజిక్ నేర్చుకుని సింగర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అనంతరం 2009లో లక్ అనే హిందీ మూవీతో తిరిగి నటిగా మారిపోయింది.
(ఇదీ చదవండి: ఈ జనరేషన్ ఆడపిల్లల మనసు ఆవిష్కరించిన సినిమా.. ఓటీటీ రివ్యూ)
'అనగనగా ఓ ధీరుడు' సినిమాతో తెలుగులోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన శ్రుతి హాసన్‌కు 'గబ్బర్ సింగ్'తో బ్రేక్ దొరికింది. తర్వాత తెలుగు, తమిళ, హిందీ అంటూ మూవీస్ చేసింది. 2023లో 'సలార్', ఈ ఏడాది రజనీకాంత్ 'కూలీ' చిత్రాలతో పాన్ ఇండియా ప్రేక్షకుల్ని కూడా పలకరించింది. రీసెంట్‌గా ఈమె స్కూల్ ఫొటో ఎందుకో వైరల్ అయింది. దీంతో ఈమె ఎక్కడుందా అని నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. ఆ పాప శ్రుతి హాసన్ అని తెలిసి ఆశ్చర్యపోతున్నారు.
శ్రుతి హాసన్ వ్యక్తిగత జీవితానికొస్తే.. కెరీర్ ప్రారంభంలో హీరో సిద్ధార్థ్‌తో డేటింగ్ చేసినట్లు వార్తలొచ్చాయి. ఇది నిజమా కాదా అనుకునేలోపు ఓ విదేశీయుడితో చెట్టాపట్టాలు వేసుకుని కనిపించింది. కొన్నాళ్ల క్రితం ఆర్టిస్ట్ శంతను హజరికాతో కొన్నాళ్లు డేటింగ్ చేసింది. అతడి నుంచి కూడా విడిపోయింది. ప్రస్తుతానికైతే ఒంటరిగానే ఉంది. మరి పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందో లేదో?
(ఇదీ చదవండి: నా భార్యకు తాళి వేసుకోవద్దనే చెబుతా: రాహుల్ రవీంద్రన్)

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
