మీడియా ముందు డైరెక్టర్‌, హీరోయిన్‌ ప్రేమపెళ్లి | director Velu Prabhakaran marries his Kadhal Kathai actress Shirley Das | Sakshi
Sakshi News home page

ముప్పై ఏళ్ల హీరోయిన్‌తో..అరవయ్యేళ్ల డైరెక్టర్‌ పెళ్లి

Jun 3 2017 7:09 PM | Updated on Sep 5 2017 12:44 PM

ప్రేమకు, పెళ్లికి వయసు అడ్డంకి కాలేదు వారిద్దరికి. అరవయ్యేళ్ల వయసులో తనకన్నా సగం తక్కువ వయసున్న హీరోయిన్‌ను ఓ దర్శకుడు రీల్‌ లైఫ్‌లోనే కాకుండా రియల్‌ లైఫ్‌లోనూ..



చెన్నై: ప్రేమకు, పెళ్లికి వయసు అడ్డంకి కాలేదు వారిద్దరికి. అరవయ్యేళ్ల వయసులో తనకన్నా సగం తక్కువ వయసున్న హీరోయిన్‌ను ఓ దర్శకుడు రీల్‌ లైఫ్‌లోనే కాకుండా రియల్‌ లైఫ్‌లోనూ పెళ్లాడి.. తమిళ చిత్ర పరిశ్రమలో హాట్‌ టాఫిక్‌గా నిలిచారు. వివరాల్లోకి వెళితే...తమిళ సినిమా దర్శకుడు వేలు ప్రభాకరన్‌(60) లేటు వివాహం తాజాగా తమిళనాట సంచలనంగా మారింది. కోలీవుడ్‌లో పలు విజయవంతమైన సినిమాలు తీసిన వేలు ప్రభాకరన్‌ కొత్తగా తమిళంలో ‘ఒరు ఇయక్కునరిన్ కాదల్ డైరీ’ , తెలుగులో ‘ఓ దర్శకుడి ప్రేమ డైరీ’ పేరుతో సినిమాను తెరకెకిక్కంచారు. దానికి హీరో, దర్శకుడు ఆయనే. ఇక ఈ దర్శకుడు తెరకెక్కించిన గత చిత్రంలో 30 ఏళ్ల షెర్లీ దాస్‌ కథానాయిక.


అప్పటి నుంచి వారి మధ్య మంచి స్నేహం కుదిరింది, అది కాస్త పెళ్లికి దారి తీసింది. ఈ  చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీంతో ఈ చిత్రం ప్రివ్యూకు స్థానిక ఫోర్ ఫ్రేమ్స్ థియేటర్ లో మీడియాకు ఆహ్వానం అందింది.  సినిమా చూసేందుకు వచ్చిన మీడియాకు దర్శకుడు సర్‌ఫ్రైజ్‌ షాక్‌ ఇచ్చారు.

దర్శకుడు వేలు ప్రభాకరన్, నటి షెర్లీ వివాహం చేసుకుంటున్నట్లు మీడియా ముందు ప్రకటించడమే కాకుండా, అక్కడికక్కడే వారిద్దరూ ఉంగరాలు మార్చుకున్నారు. అనంతరం దండలు మార్చుకుని ఇద్దరూ ఓ​ ఇంటివారయ్యారు. ఓ వృద్ద దర్శకుడు హీరోయిన్ ను ప్రేమించి పెళ్లి చేసుకునే కథాంశంతో తెరకెక్కిన ఓ దర్శకుడి ప్రేమ డైరీ చిత్రం విడుదల రోజునే మీడియా ముందు నిజజీవితంలో ఒక్కటి కావటం తమిళ చిత్రసీమలో హాట్ టాపిక్ గా మారింది.



Advertisement
 
Advertisement
Advertisement