చిరు హీరోగా మరో భారీ ప్రాజెక్ట్‌

Director Shankar Doing a Movie With Chiranjeevi - Sakshi

ఖైదీ నంబర్‌ 150 సినిమాతో గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరం‍జీవి ప్రస్తుతం ప్రస్తుతం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న హిస్టారికల్‌ ప్రాజెక్ట్‌ సైరా నరసింహారెడ్డిలో నటిస్తున్నాడు. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తరువాత స్టార్ డైరెక్టర్‌ కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు ఓకె చెప్పాడు చిరు.

తాజాగా మరో విజువల్ వండర్‌కు మెగాస్టార్‌ రెడీ అవుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. భారీ చిత్రాల దర్శకుడు శంకర్‌ దర్శకత్వంలో మెగాస్టార్ హీరోగా ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం కమల్‌ హాసన్‌ హీరోగా ఇండియన్‌ 2 తెరకెక్కిస్తున్న శంకర్‌, ఆ సినిమా తరువాత మెగాస్టార్‌ చిరంజీవితో సినిమా చేసే అవకాశం ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. చిరు ఇమేజ్‌కు శంకర్‌ లాంటి దర్శకుడు తోడైతే సంచలనాలు నమోదవుతాయంటున్నారు ఫ్యాన్స్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top