నమ్మకపోతే.. నరకానికే | Director Ram Gopal varma latest Facebook post | Sakshi
Sakshi News home page

నమ్మకపోతే.. నరకానికే

Oct 26 2017 6:07 PM | Updated on May 28 2019 10:05 AM

Director Ram Gopal varma latest Facebook post.. - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు జీవిత కథ ఆధారంగా తాను తీయబోయే 'లక్ష్మీస్‌ ఎన్‌టీఆర్‌' సినిమాకు ఇప్పటినుంచే ప్రచారాన్ని ఇచ్చుకుంటున్నారు దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ.  సోషల్‌ మీడియాలో విలక్షణంగా స్పందిస్తూ హైప్‌ క్రియేట్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వర్మ మరోసారి  తనదైన శైలిలో చెలరేగిపోయారు. సాక్షాత్తూ ఎన్‌టీఆర్‌ తనకో సందేశాన్ని పంపారంటూ వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. ఈ వీడియోను నమ్మని వారు ఏకంగా నరకానికి పోతారంటూ  శాపనార్థాలు పెట్టేశారు.  ఎన్‌టీఆర్‌ ఆత్మే తన సినిమాను కథను నడిపిస్తోందని ఇప్పటికే  చెప్పుకున్న వర్మ లేటెస్ట్‌ ఎఫ్‌బి పోస్ట్‌ ఇదే..

‘‘సాక్షాత్తూ NTR గారే నాకీ సందేశాన్ని ఆకాశవాణి ద్వారా పంపారు. ఇది నమ్మని వాళ్ళందరూ ఖచ్చితంగా నరకానికి పోతారని కూడా చెప్పమన్నారు. అన్నగారే నాకు ఈ సందేశాన్ని ఆకాశవాణి ద్వారా పంపారు. ఇది నమ్మని వాళ్ళందరూ ఖఛ్చితంగా నరకానికి పోతారని కూడా చెప్పమన్నారు’’.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement