డబ్బు వాపసు చేస్తేనే నిజమైన నిరసన

Director Jayaraj asks boycotting winners to return award money - Sakshi

ఇటీవల నేషనల్‌ అవార్డ్స్‌లో  రాష్ట్రపతి పరిమిత సమయం కారణంగా అందరికీ అవార్డ్స్‌ ప్రదానం చేయరని తెలిసి పలువురు విజేతలు నేషనల్‌ అవార్డ్స్‌ను బాయ్‌కాట్‌ చేసిన సంగతి తెలిసిందే. అవార్డ్‌ ఫంక్షన్‌ బాయ్‌కాట్‌ చేసినవాళ్లను ఉద్దేశిస్తూ.. 2018 నేషనల్‌ అవార్డ్‌ అందుకున్న మలయాళ దర్శకుడు జయరాజ్‌ మాట్లాడుతూ– ‘‘కేంద్ర సమాచార  ప్రసార శాఖ మంత్రి స్మృతీ ఇరానీ చేతుల మీదగా అవార్డ్‌ అందుకోవటం మాకు ఇష్టం లేదు అని బాయ్‌కాట్‌ చేసిన నిరసనకారులంతా కేవలం అవార్డ్‌ ఫంక్షన్‌ని బాయ్‌కాట్‌ చేయడమే కాదు నేషనల్‌ అవార్డ్‌తో పాటుగా మీకు అందే క్యాష్‌ ప్రైజ్‌ను కూడా తిరిగి ఇవ్వాలి. అదే నిజమైన నిరసన’’ అన్నారు. పాయింటే కదా. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top