సూపర్‌ హిట్ రీమేక్‌కు హరీష్‌..!

Dil Raju Offers 96 Remake To Harish Shankar - Sakshi

స్టార్‌ ప్రొడ్యూసర్‌ దిల్‌ రాజు, యంగ్‌ డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కనుందన్న టాక్‌ చాలా రోజులుగా వినిపిస్తోంది. దాగుడు మూతలు పేరుతో ఈ కాంబినేషన్‌లో ఓ సినిమా దాదాపుగా ఫైనల్‌ అయినట్టుగా ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రాజెక్ట్ వర్క్‌ అవుట్‌ కాకపోయినా దిల్‌ రాజు  బ్యానర్‌లో మరో సినిమాకు హరీష్ దర్శకత్వం వహించనున్నారన్న టాక్‌ వినిపిస్తోంది.

కోలీవుడ్‌ లో సూపర్ హిట్ అయిన 96 సినిమాను తెలుగులో రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా రీమేక్‌ రైట్స్‌ను దిల్ రాజు సొంతం చేసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. నాని, సమంత జంటగా ఈ సినిమా తెరకెక్కే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్‌కు హరీష్ శంకర్‌ దర్శకత్వం వహించనున్నారట. గతంలో గబ్బర్‌సింగ్‌తో రీమేక్‌ను తెరకెక్కించిన అనుభవం ఉన్న హరీష్ 96కు దర్శకత్వం వహించటం దాదాపు కన్ఫామ్ అయినట్టుగా తెలుస్తోంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top