నేను లేని నా ప్రేమ | Dil Raju Launches Nenu Leni Naa Prema Katha First look | Sakshi
Sakshi News home page

నేను లేని నా ప్రేమ

Feb 15 2020 3:50 AM | Updated on Feb 15 2020 3:50 AM

Dil Raju Launches Nenu Leni Naa Prema Katha First look - Sakshi

క్రిష్, అదితి, గాయత్రి, నవీన్‌చంద్ర

‘‘నేను లేని నా ప్రేమకథ’ ఒక విభిన్నమైన ప్రేమకథగా తెరకెక్కింది. ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ బాగుంది. సినిమా కూడా అలాగే ఉంటుందనే నమ్మకం ఉంది’’ అన్నారు నిర్మాత ‘దిల్‌’ రాజు. నవీన్‌ చంద్ర, గాయత్రి ఆర్‌. సురేష్‌ జంటగా సురేష్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నేను లేని నా ప్రేమకథ’. ఎమ్‌ఎస్‌ సుబ్బలక్ష్మి సమర్పణలో కళ్యాణ్‌ కందుకూరి నిర్మించిన ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ని ‘దిల్‌’ రాజు విడుదల చేశారు. కళ్యాణ్‌ కందుకూరి మాట్లాడుతూ– ‘‘ప్రేమకథలు తెరపై చాలా కనిపించినా మా ప్రేమకథ అందించే అనుభూతి కొత్తగా ఉంటుంది.

ఈ సినిమా చూసిన ప్రేక్షకులు వారి ప్రేమ కథకి దగ్గరవుతారు. నవీన్‌ చంద్ర, గాయత్రి వారి పాత్రల్లో ఇమిడిపోయి నటించారు. వేసవిలో సినిమాని విడుదల చేయనున్నాం. మా చిత్రం  కాన్సెప్ట్‌ని తెలుసుకున్న ‘దిల్‌’ రాజుగారు ఫస్ట్‌ లుక్‌ని విడుదల చేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు. క్రిష్‌ సిద్దిపల్లి, అదితి, రాజారవీంద్ర, బందు దివిజ తదితరులు నటించిన ఈ చిత్రానికి సహ నిర్మాతలు: గూడూరు వెంకట్, గూడూరు ప్రసాద్, కెమెరా: ఎస్‌.కె.ఏ.భూపతి, సంగీతం: జువెన్‌ సింగ్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement