తమిళంలో డిజిటల్ శంకరాభరణం | Digital "Sankarabharanam" Release in Tamil | Sakshi
Sakshi News home page

తమిళంలో డిజిటల్ శంకరాభరణం

Dec 4 2013 1:07 AM | Updated on Sep 2 2017 1:13 AM

తమిళంలో డిజిటల్   శంకరాభరణం

తమిళంలో డిజిటల్ శంకరాభరణం

తెలుగు సినిమా కీర్తి పతాకాన్ని అంతర్జాతీయ యవనికపై రెపరెపలాడించిన సినిమా ‘శంకరాభరణం’ (1979). కె.విశ్వనాథ్ దర్శకత్వంలో పూర్ణోదయా

 తెలుగు సినిమా కీర్తి పతాకాన్ని అంతర్జాతీయ యవనికపై రెపరెపలాడించిన సినిమా ‘శంకరాభరణం’ (1979). కె.విశ్వనాథ్ దర్శకత్వంలో పూర్ణోదయా మూవీ క్రియేషన్స్ పతాకంపై ఏడిద నాగేశ్వరరావు నిర్మించిన ఈ చిత్రం విడుదలై 34 ఏళ్లవుతున్నా ఇంకా క్రేజ్ తగ్గలేదు. అందుకు నిదర్శనం ఏంటంటే - ఈ చిత్రాన్ని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో డిజిటలైజ్ చేసి, 5.1 సౌండ్ సిస్టమ్ హంగులతో, సినిమా స్కోప్‌లోకి మార్చి తమిళంలో విడుదల చేయబోతున్నారు. తమిళ నాట ప్రస్తుతం పాత సినిమాలను డిజిటలైజ్ చేసి మళ్లీ విడుదల చేసే ట్రెండ్ మొదలైంది. 
 
ఈ నేపథ్యంలో తమిళ నిర్మాత ఒకరు ‘శంకరాభరణం’ అనువాద హక్కులు తీసుకుని డిజిటలైజ్ చేసి, ఈ నెలాఖరున విడుదల చేయబోతున్నారు. గతంలో ‘శంకరాభరణం’ తెలుగు వెర్షనే తమిళనాట సిల్వర్ జూబ్లీ ఆడింది. మరి ఈ తమిళ వెర్షన్ ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ డిజిటల్ వెర్షన్‌ని తెలుగులో కూడా విడుదల చేసే యోచనలో ఉన్నారు ఏడిద నాగేశ్వరరావు. ఈ ట్రెండ్ ఫలితంగా... శిథిలావస్థకు చేరుకున్న సినిమాల ప్రింట్లు కొత్త హంగులు అద్దుకుంటే సినీ ప్రియులకు అంతకన్నా ఆనందం ఏముంటుంది!
 

Advertisement
 
Advertisement
Advertisement