18న తెరపైకి 18–05–2009

Different Titile Movie Released In 18th - Sakshi

తమిళసినిమా: ఒక తేదీనే టైటిల్‌గా చిత్రాలు తెరకెక్కిడం అరుదే. అదేవిధంగా తాజాగా 18–05–2009 పేరుతో ఒక చిత్రం రూపొందింది. అయితే ఈ టైటిల్‌ వెనుక బలమైన కథ, లక్షలాది మంది ప్రాణత్యాగాలు, పోరుబాట, ఆక్రందనలు, ఆవేదనలు ఉన్నాయి. శ్రీలంక తమిళుల హక్కుల పోరాటం, సాయుధ దళాల కిరాతకం లాంటి హృదయ విషాదకర కథాంశంతో కూడిన చిత్రం 18–05–2009. గురునాధ్‌ కలసాని నిర్మించిన ఈ చిత్రానికి కే.గణేశన్‌ దర్శకుడు. కర్ణాటకకు చెందిన తమిళుడైన గణేశన్‌ ఇంతకు ముందు పలు కన్నడ చిత్రాలతో పాటు తమిళం,తెలుగు చిత్రాలకు దర్శకత్వం వహించారు.  త  తాజా చిత్రం గురించి ఆయన తెలుపుతూ శ్రీలంక తమిళులను ఆ దేశ సాయుదళాలు ఊచకోత కోసిన సంఘటనలు 18.05.2009 వరకూ కొనసాగాయన్నారు.

ఇది చరిత్ర ఎప్పటికీ మరచిపోదన్నారు. ఒక్క చివరిరోజునే 40 వేల మంది  ముక్కుపచ్చలారని చిన్నారులతో పాటు మహిళలు, పురుషులు హత్యకు గురయ్యారన్నారు. తమిళులుగా పుట్టిన ఒకే కారణంతో అమాయకపు మహిళలను కూడా రాక్షసత్వంతో  శ్రీలంక సాయుధ దళాలు చంపేశాయన్నారు. న్యాయం కోసం గొంత్తెత్తిన వారి కేకలు శ్రీలంక గాలిలో కలిసిపోయాయన్నారు. ఈ సంఘటనలు కళ్లకు కట్టినట్లు తెరపై ఆవిష్కరించిన చిత్రం 18–05–2009 అని చెప్పారు. సుభాష్‌ చంద్రబోస్, ప్రభాకరన్, నాగినీడు, తాన్యా, జేకప్, శ్రీరామ్, బాలాజీ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన చిత్రానికి సంగీత రారాజు ఇళయరాజా సంగీతం అందించడం విశేషం. ఈ చిత్రాన్ని ఈ నెల 18న విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత తెలిపారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top