డిఎన్‌ఏ పరీక్షకు ధనుష్‌ నో! | Dhanush paternity case | Sakshi
Sakshi News home page

డిఎన్‌ఏ పరీక్షకు ధనుష్‌ నో!

Apr 13 2017 12:17 AM | Updated on Sep 28 2018 8:12 PM

డిఎన్‌ఏ పరీక్షకు ధనుష్‌ నో! - Sakshi

డిఎన్‌ఏ పరీక్షకు ధనుష్‌ నో!

డీఎన్‌ఏ పరీక్షకు నటుడు ధనుష్‌ ససేమిరా అంటున్నారు. ధనుష్‌ తమ కొడుకు అంటూ మదురై జిల్లా మేలూర్కు చెందిన కదిరేశన్‌–

డీఎన్‌ఏ పరీక్షకు నటుడు ధనుష్‌ ససేమిరా అంటున్నారు. ధనుష్‌ తమ కొడుకు అంటూ మదురై జిల్లా మేలూర్కు చెందిన కదిరేశన్‌–మీనాక్షి దంపతులు మదురై కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయడంతో మొదలైన కలకలం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. తాజా పరిణామం ఏమిటంటే  కదిరేశన్, మీనాక్షీ దంపతులు ధనుష్‌ తమ కొడుకేనని నిరూపించడానికి తాము డీఎన్‌ఏ పరీక్షకు సిద్ధం అని మరో పిటిషన్‌ను దాఖలు చేశారు.

మంగళవారం ఈ పిటిషన్‌పై విచారణ జరగగా వారి ఆరోపణల్లో నిజం లేదని, అందుకు ఆధారాలు తాము ఇప్పటికే కోర్టుకు సమర్పించామని ధనుష్‌ తరఫు న్యాయవాది వాదించారు. అయితే డీఎన్‌ఏ పరీక్షకు అంగీకరించబోమని, అది నటుడు ధనుష్‌ ఆత్మవిశ్వాసానికి, స్వేచ్ఛకు భంగం కలిగిస్తుందని కోర్టుకు వివరించారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణ తేదీని ప్రకటించకుండా వాయిదా వేశారు.

Advertisement
 
Advertisement
Advertisement