బూస్ట్‌ ఇచ్చారు | Dhanush croons for Vivek's film | Sakshi
Sakshi News home page

బూస్ట్‌ ఇచ్చారు

Jul 29 2018 1:44 AM | Updated on Jul 29 2018 9:47 AM

Dhanush croons for Vivek's film - Sakshi

ధనుష్‌

‘వై దిస్‌ కొలవెరి’తో తమిళ హీరో ధనుష్‌ ఎంత సెన్సేషన్‌ క్రియేట్‌ చేశారో మనందరికీ తెలిసిందే. తరచూ కాకపోయినా అప్పడప్పుడు తన సినిమాల్లో, ఫ్రెండ్లీగా వేరే హీరోల సినిమాలకు పాడుతుంటారాయన. రీసెంట్‌గా కమెడియన్‌ వివేక్‌ సినిమా కోసం ఓ పాట పాడారట. ‘‘ఉత్తమపుత్తిరన్, రఘువరన్‌ బీటెక్‌’లో వీళ్ల కాంబినేషన్‌లో కామెడీ బాగా కుదిరింది. ఇప్పుడు ఆ ఫ్రెండ్‌షిప్‌తోనే వివేక్‌ లేటెస్ట్‌ సినిమా ‘ఇళుమిన్‌’ కోసం మైక్‌ పట్టుకున్నారట ధనుష్‌. గణేశ్‌ చంద్రశేఖర్‌ కంపోజ్‌ చేసిన సాంగ్‌ను ధనుష్‌ పాడగా రికార్డ్‌ చేశారు. ‘‘ధనుష్‌ పాట సినిమాకు స్పెషల్‌గా ఉండబోతుంది. సినిమాకు కూడా ఆయన పాడిన పాట బూస్ట్‌’’ అన్నారు దర్శకుడు.

Advertisement
 
Advertisement
Advertisement