ధనలక్ష్మి తెచ్చే మలుపులు | Dhanalakshmi turns to reality | Sakshi
Sakshi News home page

ధనలక్ష్మి తెచ్చే మలుపులు

Apr 11 2015 1:13 AM | Updated on Sep 3 2017 12:07 AM

ధనలక్ష్మి తెచ్చే మలుపులు

ధనలక్ష్మి తెచ్చే మలుపులు

డబ్బంటే ధనలక్ష్మి. ఆమె రాక ఎవ్వరినైనా ఏరువాకే. ధనలక్ష్మి ఎవరికి చేదు....

డబ్బంటే ధనలక్ష్మి. ఆమె రాక ఎవ్వరినైనా ఏరువాకే. ధనలక్ష్మి ఎవరికి చేదు....! కష్టపడి సంపాదించేవాళ్లు కొందరైతే.....ఇక ఉచితంగా వస్తే ఎంతైనా తీసుకోవడానికి వెనుకాడని వారు మరికొందరు. ఓ నలుగురి జీవితాల తలుపు తట్టింది ధనలక్ష్మి. మరి వారి జీవితాలు ఆ తర్వాత ఎటువంటి మలుపులు తీసుకున్నాయనే కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం ‘ధనలక్ష్మి తలుపు తడితే’.

ధనరాజ్, మనోజ్‌నందం , సింధుతులానీ ముఖ్యతారలుగా  భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాయి అచ్యుత్ చిన్నారి దర్శకుడు. ఇటీవలే చిత్రీకరణ పూర్తిచేసుకుని నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. కథాకథనాలు హైలైట్‌గా నిలుస్తాయని, ఈ నెలాఖరులో చిత్రాన్ని విడుదల చేస్తామనీ నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: భోలే శావలి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ప్రసాద్ మల్లు, ప్రతాప్ భీమిరెడ్డి, సమర్పణ: మాస్టర్ సుక్కురామ్.
 

Advertisement
 
Advertisement
Advertisement