4 నిమిషాలకు 1.3 కోట్లు | Deepika, Priyanka to get Rs 33 lakh per minute for award show | Sakshi
Sakshi News home page

4 నిమిషాలకు 1.3 కోట్లు

Jun 25 2016 12:33 PM | Updated on Sep 4 2017 3:23 AM

4 నిమిషాలకు 1.3 కోట్లు

4 నిమిషాలకు 1.3 కోట్లు

ప్రతీ ఏటా ఘనంగా నిర్వహించే బాలీవుడ్ అవార్డ్స్ కార్యక్రమం ఈ ఏడాది స్పెయిన్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గతంలో మాదిరిగానే ఈ ఏడాది కూడ బాలీవుడ్ టాప్ స్టార్స్తో వేదిక మీద....

ప్రతీ ఏటా ఘనంగా నిర్వహించే బాలీవుడ్ అవార్డ్స్ కార్యక్రమం ఈ ఏడాది స్పెయిన్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గతంలో మాదిరిగానే ఈ ఏడాది కూఢా బాలీవుడ్ టాప్ స్టార్స్తో వేదిక మీద డ్యాన్స్ పర్ఫామెన్స్ ఇప్పించేందుకు రెడీ అవుతున్నారు నిర్వాహకులు. ఇందుకోసం తారలకు భారీ మొత్తంలో పారితోషికం కూడా అందిస్తున్నారు. అయితే గతంతో పోలిస్తే ఈసారి ఈ సంఖ్య మరింత భారీగా ఉందన్న టాక్ వినిపిస్తోంది.

తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం బాలీవుడ్ హాట్ బ్యూటీస్ ప్రియాంక చోప్రా, దీపిక పదుకొనే ఈసారి ఫంక్షన్లో స్పెషల్ ఎట్రాక్షన్గా నిలవనున్నారు. హాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న ఈ ఇద్దరినీ చూసేందుకు అభిమానులు ఎదురుచూస్తున్నారు. అందుకే వీరితో పర్ఫామ్ చేయించడానికి ఎంతైనా ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారు నిర్వాహకులు.

అందుకే తగ్గట్టుగానే ఈ ఇద్దరు భామలు పెద్ద మొత్తాన్నే డిమాండ్ చేస్తున్నారట. స్టేజ్ మీద నాలుగు నిమిషాల పాటు డ్యాన్స్ చేయనున్న దీపిక ఒక్కో నిమిషానికి 33 లక్షలు చార్జ్ చేస్తుందట. అంటే దాదాపుగా కోటి 32 లక్షలు అన్నమాట. ప్రియాంక కూడా దాదాపుగా ఇదే మొత్తాన్ని డిమాండ్ చేస్తోంది. అయితే ఈ ఇద్దరు ముద్దుగుమ్మలకు ఉన్న క్రేజ్ దృష్ట్యా  ఆ పారితోషికం ఇచ్చేందుకు ఓకే చెప్పేశారు.

బాలీవుడ్ హీరోలతో పోల్చుకుంటే ఈ హాట్ బ్యూటీస్ తీసుకునేది పెద్ద మొత్తమే కాదనిపిస్తుంది. ఇదే వేదిక మీద పర్ఫామ్ చేయడానికి సల్మాన్ ఖాన్ 5 కోట్ల రూపాయలు వసూలు చేస్తుండగా, హృతిక రోషన్ 4 కోట్ల వరకు చార్జ్ చేస్తున్నాడట. అయితే అంతర్జాతీయ స్థాయిలో ఈ స్టార్స్కు ఉన్న ఫాలోయింగ్ దృష్టిలో పెట్టుకొని ఎంతైనా ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement