అభిమానుల‌ను ఊరించిన ర‌ణ్‌వీర్ సింగ్‌ | Deepika Padukone Makes Pizza For Ranveer Singh | Sakshi
Sakshi News home page

అభిమానుల‌ను ఊరించిన ర‌ణ్‌వీర్ సింగ్‌

Apr 12 2020 10:19 AM | Updated on Apr 12 2020 11:07 AM

Deepika Padukone Makes Pizza For Ranveer Singh - Sakshi

లాక్‌డౌన్ వేళ చాలామంది జ‌నాలు తొలిసారిగా వంటింట్లో అడుగుపెట్టి, అక్క‌డ ప్ర‌యోగాలు చేస్తూ చేతులు కాల్చుకుంటున్నారు. సినీ తార‌లు కూడా త‌మ కిచెన్‌లోకి దూరి పాక‌శాస్త్ర ప్రావీణ్యాన్ని బ‌య‌ట‌కు తీస్తున్నారు. అయితే వాళ్లు చేయాల‌నుకుంది ఒక‌టైతే.. తీరా వంట పూర్త‌య్యేస‌రికి అది మ‌రో వంట‌కంగా రూపు దిద్దుకుంటోంది. దీనికి క‌త్రినా కైఫ్ చేసిన పాన్‌కేక్ మంచి ఉదాహ‌ర‌ణగా చెప్పుకోవ‌చ్చు. దీనికి నెటిజ‌న్లు "ఊరుకోండి.. ఆమ్లెట్‌ను పాన్‌కేక్ అంటారేంటి?" అని ఫ‌న్నీ సెటైర్లు విసిరిన విష‌యం తెలిసిందే. అయితే వంటల్లో ఇంత‌కుముందే శిక్ష‌ణ తీసుకున్న‌ బాలీవుడ్‌ హీరోయిన్ దీపికా ప‌దుకొనే త‌న భ‌ర్త ర‌ణ్‌వీర్ సింగ్‌కు చేతులారా వండి వ‌డ్డిస్తోంది. తాజాగా ఆమె పిజ్జా చేస్తుండ‌గా తీసిన ఫొటోల‌ను ర‌ణ్‌వీర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. (లైవ్‌ చాట్‌లో రణ్‌వీర్‌ ఫన్నీ కామెంట్‌!)

"ఈరోజు నేను దీపిక చేసే పేద్ద పిజ్జాను తిన‌బోతున్నాను" అని అభిమానుల‌ను ఊరించాడు. అంతేకాక ఆమె చీజ్ ల‌వ‌ర్ అని రాసుకొచ్చాడు. కొద్దిరోజుల క్రితం ‌కూడా భార్య చేసిన‌‌ థాయ్ స్పెష‌ల్స్.. థాయ్ గ్రీన్ క‌ర్రీ, టామ్ య‌మ్ సూప్‌, థాయ్ స‌లాడ్‌ల ఫొటోల‌ను ర‌ణ్‌వీర్ షేర్ చేశాడు. కాగా ఎప్పుడూ సినిమాల‌తో బిజీగా ఉండే ర‌ణ్‌వీర్ ఇప్పుడు గుర్రుపెట్టి నిద్ర‌పోతున్నాడ‌ని దీపిక చెప్పుకొచ్చింది. రోజులో 20 గంట‌లు నిద్ర‌పోతూ మిగిలిన నాలుగు గంట‌లు తింటూ, సినిమాలు చూస్తూ, వ్యాయామం చేయ‌డానికి వినియోగిస్తున్నాడంటూ లాక్‌డౌన్ ముచ్చ‌ట్ల‌ను చెప్పుకొచ్చింది. (హీరోలకు అండగా ఉందాం)

Advertisement
 
Advertisement
Advertisement