నాకు గొంతే ఇష్టం | dandupalyam 3 trailer release today | Sakshi
Sakshi News home page

నాకు గొంతే ఇష్టం

Dec 18 2017 12:22 AM | Updated on Dec 18 2017 12:22 AM

dandupalyam 3 trailer release today - Sakshi

‘పదకొండు మంది.. ఐదు సంవత్సరాలు.. ఎనభై కేసులు.. మూడు రాష్ట్రాల పోలీసుల కళ్లు కప్పి క్రూర మృగాల్లా తిరుగుతున్నారు’’ అంటూ ప్రారంభమయ్యే ‘దండుపాళ్యం 3’ ట్రైలర్‌ సినిమాపై ఆసక్తి పెంచుతోంది. ‘నీకు గొంతుపై ఉండే మాల్‌ ఇష్టం.. వీడికి గొంతు కింద ఉండే మాల్‌ ఇష్టం. నాకు గొంతే ఇష్టం’ అనే మరో డైలాగ్‌ దండుపాళ్యం గ్యాంగ్‌ క్రూరత్వాన్ని చూపేలా ఉంది. బొమ్మాళి రవిశంకర్, పూజాగాంధీ, మకరంద్‌ దేశ్‌పాండే, రవికాలే ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘దండుపాళ్యం 3’.

శ్రీనివాసరాజు దర్శకత్వంలో రజనీ తాళ్ళూరి నిర్మించిన ఈ చిత్రం జనవరి 25న రిలీజ్‌ అవుతోంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ విడుదల చేశారు. కన్నడ, తెలుగు భాషల్లో ఘనవిజయం సాధించి, కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టించిన ‘దండుపాళ్యం’ సీక్వెల్స్‌లో భాగంగా ‘దండుపాళ్యం 3’ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ‘‘ఇటీవల విడుదలైన టీజర్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ట్రైలర్‌కి కూడా అదే రేంజ్‌లో స్పందన వస్తోంది’’ అన్నారు దర్శకుడు శ్రీనివాసరాజు. ఈ చిత్రానికి సంగీతం: అర్జున్‌ జన్యా, కెమెరా: వెంకట్‌ ప్రసాద్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement