మాస్‌ పోలీస్‌

police patas first look and poster release - Sakshi

ఆయేషా హబీబ్, రవి కాలే ప్రధాన పాత్రల్లో శశికాంత్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పోలీస్‌ పటాస్‌’. తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించిన 97వ చిత్రమిది. ఈ సినిమా  ఫస్ట్‌ లుక్‌ను రాజ్యసభ సభ్యుడు టి.జి.వెంకటేష్‌ ఆవిష్కరించారు. ఇటీవల రోశయ్య 87వ  జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ చిత్రం ట్రైలర్‌ను రోశయ్య చేతుల మీదగా ఆవిష్కరించారు. ‘‘ఈ  చిత్రం ఘనవిజయం సాధించాలి’’ అన్నారు రోశయ్య. ‘‘ఆయేషా నటన ఈ చిత్రానికి హైలైట్‌. మాస్‌ను ఆకట్టుకునే అంశాలన్నీ ఈ సినిమాలో ఉంటాయి. త్వరలోనే సినిమాని విడుదల చేస్తాం’’ అన్నారు రామ సత్యనారాయణ.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top