సల్మాన్, షారూఖ్లకు షాక్ | court accepts plea against Shah Rukh, Salman | Sakshi
Sakshi News home page

సల్మాన్, షారూఖ్లకు షాక్

Jan 16 2016 1:38 PM | Updated on Sep 3 2017 3:45 PM

బాలీవుడ్ స్టార్ హీరోలు, సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్ లపై మీరట్ లోకల్ కోర్టులో కేసు నమోదైంది.

బాలీవుడ్ స్టార్ హీరోలు, సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్లపై మీరట్ లోకల్ కోర్టులో హిందూ మహాసభ ఫిర్యాదు చేసింది. ఓ ఛానల్లో ప్రసారం అయిన కార్యక్రమంలో ఈ ఇద్దరు నటులు చెప్పులతో ఆలయంలో ప్రవేశించినట్టుగా చూపించినందుకు గాను, షారూఖ్, సల్మాన్ లతో పాటు ఛానల్ యాజమాన్యంపై కూడా హిందూ మహాసభ కార్యకర్తలు కోర్టులో ఫిర్యాదు చేశారు. జనవరి 18న ఈ కేసు విచారణకు రానుంది. దీంతో బాలీవుడ్ ఖాన్ ద్వయం ఇబ్బందుల్లో పడింది. 

వివరాల్లోకి వెళితే  ఓ  ప్రయివేట్ ఛానల్ లో ప్రసారమవుతున్న 'బిగ్ బాస్ ' చిత్రీకరణలో భాగంగా  కాళీ మందిరంలోకి ఈ హీరోలిద్దరూ షూ తో  వెళ్లి, సాంప్రదాయాన్ని  అవమానించారని  హిందూ మహాసభ అధ్యక్షుడు రాజ్పుత్ ఆరోపిస్తున్నారు.   పాదరక్షలతో  పవిత్ర స్థలంలోకి అడుగుపెట్టడాన్ని ఏమతమూ అంగీకరించదన్నారు.    ఈ  దృశ్యాలను ప్రసారం  చేసిన సదరు చానల్కు, జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు,  కలెక్టరుకు గత ఏడాది డిసెంబర్ 23న ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. అందుకే   వారిపై చర్యలు  తీసుకోవాల్సింది కోరుతూ కోర్టును ఆశ్రయించామని  ఆయన తెలిపారు. 

 

Advertisement
 
Advertisement
Advertisement