వడచెన్నై చిత్రానికి వ్యతిరేకంగా ఆందోళన | Controversy Dialogues In Vada Chennai Movie | Sakshi
Sakshi News home page

29న వడచెన్నై చిత్రానికి వ్యతిరేకంగా ఆందోళన

Oct 25 2018 10:49 AM | Updated on Oct 25 2018 10:49 AM

Controversy Dialogues In Vada Chennai Movie - Sakshi

వడచెన్నై చిత్రంలో ఓ దృశ్యం

ఈ చిత్రంలో పలు సంభాషణలు ఆక్షేపణీయంగా ఉన్నాయనే ఆరోపణలు వస్తున్నాయి.

చెన్నై ,పెరంబూరు: వడచెన్నై చిత్రానికి వ్యతిరేకంగా ఈ నెల 29న ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తమిళ్‌ తిరైపడ పాదుగాప్పు కళగం ప్రకటించింది. నటుడు ధనుష్‌ కథానాయకుడిగా నటించి తన వండర్‌బార్‌ ఫిలింస్‌ పతాకంపై నిర్మించిన చిత్రం వడచెన్నై. వెట్రిమారన్‌ దర్శకత్వం వహించిన ఇందులో నటి ఐశ్వర్యరాజేశ్, ఆండ్రియా, సముద్రకని, అమీర్‌  ముఖ్యపాత్రల్లో నటించారు. ఉత్తర చెన్నై నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవల విడుదలైంది.

ఈ చిత్రంలో పలు సంభాషణలు ఆక్షేపణీయంగా ఉన్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. కాగా వాటిని చిత్రం నుంచి తొలగించాలనే డిమాండ్‌ పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తమిళ్‌ తిరైపడ పాదుగాప్పు కళగం నిర్వాహకులు వడచెన్నై చిత్రంలోని అసభ్య సంభాషణలను తొలగించాలంటే ఆందోళన చేపట్టనున్నట్లు తెలిపారు. చిత్రంలో మహిళలు అసభ్యంగా మాట్లాడే సన్నివేశాలు చోటుచేసుకున్నాయని వాటిని తొలగించాలంటూ, చిత్ర దర్శక నిర్మాతలకు వ్యతిరేకంగా ఈ నెల 29న చెన్నైలో ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement