స్టార్ కమెడియన్ పోలీస్ కంప్లైంట్ | Comedian Venu Madhav complaint against news chennal | Sakshi
Sakshi News home page

స్టార్ కమెడియన్ పోలీస్ కంప్లైంట్

May 10 2016 1:06 PM | Updated on Aug 21 2018 8:23 PM

స్టార్ కమెడియన్ పోలీస్ కంప్లైంట్ - Sakshi

స్టార్ కమెడియన్ పోలీస్ కంప్లైంట్

టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ వేణుమాధవ్ మంగళవారం పోలీసులను ఆశ్రయించారు. ఓ తెలుగు న్యూస్ ఛానల్‌తో పాటు మరో రెండు సోషల్ మీడియా వెబ్‌సైట్లలో..

టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ వేణుమాధవ్ మంగళవారం పోలీసులను ఆశ్రయించారు. ఓ తెలుగు న్యూస్ ఛానల్‌తో పాటు మరో రెండు సోషల్ మీడియా వెబ్‌సైట్లలో తాను చనిపోయినట్టుగా వచ్చిన వార్తలపై ఆయన కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇటీవల చాలా సందర్భంలో మీడియా అత్యుత్సాహం మూలంగా సెలబ్రీటిలపై తప్పుడు వార్తలు ప్రచారం అవుతున్నాయి.

తమిళ కమెడియన్ సెంథిల్ చనిపోయినట్టుగా వార్తలు రావటం, తరువాత ఆయన వీడియో మెసేజ్ ద్వారా తాను బతికే ఉన్నట్టుగా వివరణ ఇచ్చి, రెండు రోజులు కూడా గడవక ముందే తెలుగు నటుడు వేణుమాధవ్కు అలాంటి అనుభవమే ఎదురైంది. దీంతో మానసిక వేదనకు గురైన ఈ స్టార్ కమెడియన్ అందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement