కాలేజీ రోజులు | College Days movie will be impressive with the youth | Sakshi
Sakshi News home page

కాలేజీ రోజులు

Jun 22 2017 2:26 AM | Updated on Mar 21 2019 9:05 PM

కాలేజీ రోజులు - Sakshi

కాలేజీ రోజులు

దర్శకుడు క్రిష్‌ వద్ద కో–డైరెక్టర్‌గా పని చేసిన రజినీకాంత్‌ ‘కాలేజ్‌ డేస్‌’ చిత్రంతో దర్శకునిగా మారారు.

దర్శకుడు క్రిష్‌ వద్ద కో–డైరెక్టర్‌గా పని చేసిన రజినీకాంత్‌ ‘కాలేజ్‌ డేస్‌’ చిత్రంతో దర్శకునిగా మారారు. నూతన నటీనటులతో శ్రీలత నిర్మిస్తున్న ఈ సినిమా బుధవారం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి పటేల్‌ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, నిర్మాత మల్కాపురం శివకుమార్‌ క్లాప్‌ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌ రెడ్డి స్క్రిప్ట్‌ని చిత్ర బృందానికి అందించారు.

శ్రీలత మాట్లాడుతూ– ‘‘మా బ్యానర్‌లో ఇది రెండో సినిమా. మొదటి చిత్రాన్ని త్వరలో విడుదల చేస్తాం. కళాశాల నేపథ్యంలో మంచి సందేశంతో యూత్‌ని ఆకట్టుకునే విధంగా ‘కాలేజ్‌ డేస్‌’ ఉంటుంది’’ అన్నారు. ‘‘నా కథను నమ్మి శ్రీలతగారు దర్శకునిగా అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. జూలై మొదటి వారంలో హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తాం’’ అన్నారు రజినీకాంత్‌. ఈ చిత్రానికి కెమెరా: ఎ.కె. ఆనంద్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ : పి. ఈశ్వర్‌ రావు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement