పవన్‌తో నటించడం ప్రత్యేకమన్న హీరోయిన్‌ | Cinema has made me stronger: Shruti Haasan | Sakshi
Sakshi News home page

పవన్‌తో నటించడం ప్రత్యేకమన్న హీరోయిన్‌

Feb 22 2017 1:30 PM | Updated on Mar 22 2019 5:33 PM

పవన్‌ కళ్యాణ్‌కు ఎప్పుడు కృతజ్ఞురాలినని శృతిహాసన్‌ చెబుతోంది.

చెన్నై: సినీ గ్లామర్‌తో నటుల ప్రవర్తనలో మార్పు రావడం సహజం. కానీ, సౌత్‌ బ్యూటీ శృతిహాసన్‌ మాత్రం ఏమి మారలేదంటూ, సినిమాలే తనని బలంగా మార్చయని, సినిమాలకు రాక ముందు ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలానే ఉన్నానని చెప్పుకోస్తోంది. ప్రస్తుతం  స్నేహితులతో అలానే గడుపుతున్నానని తెలిపింది ఈ ముద్దుగుమ్మ. సినిమా అనేది ఉద్యోగం కన్నా ఎక్కువని, ఇది మనందరి కలల ప్రపంచాన్ని ఆవిష్కరిస్తుందని ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది. 

సినిమాల్లో ఎనిమిది ఏళ్లుగా నటిస్తున్నానని, వెనక్కి తిరిగి చూస్తే నటించడంతో బలంగా మారానని చెప్పింది. కమల్‌హాసన్‌, సారికాల కూతురిగా ఎలా పెరిగానో అలానే ఉన్నానని, ఇప్పటికి వారితోను, స్నేహితులతోను సంతోషంగా ఉంటున్నానని పేర్కొంది. శృతి హాసన్‌కు కెరీర్‌ మొదట్లో అన్ని అపజయాలే ఎదురయ్యాయి.  ఆమె నటించిన లక్‌, అనగ అనగా ఓ ధీరుడు, 7ఏఎం అరివూ సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద చతికిలపడ్డాయి. అయినా తను నిరాశ చెందలేదని, ఈ సినిమాల్లో బాగా నటించానని, దర్శకుల సూచనలు పాటించానని చెప్పింది. సినిమాల విజయాలు, వైఫల్యాలకు నటులే కారణం కాదని అనేక విషయాలు ఉంటాయని చెబుతోంది. అందరిలా ఫెయిల్యూర్స్‌ను పట్టించుకోనని, ఓ మై ఫ్రెండ్‌, 7ఏఎం సినిమాల్లో నటించినందుకు గర్వంగా ఉందని ఈ సినిమాలు ప్రత్యేకమని తెలిపింది.
 
శృతిహాసన్‌ పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ సినిమా గబ్బర్‌సింగ్‌తో ఒక్కసారిగా స్టార్‌ హీరోయిన్‌ అయింది. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన పవన్‌ కళ్యాణ్‌కు ఎప్పుడు కృతజ్ఞురాలినని ఆమె తెలిపింది. పవన్‌ చాలా సపోర్ట్‌ చేశాడని అది ఎప్పటికి మర్చిపోలేనని చెప్పింది.  శృతి, పవన్‌ల అపకమింగ్‌ చిత్రం కాటమరాయుడు షూటింగ్‌ జరుపుకుంటుంది. ఈ సినిమాలో ఆయనతో నటించడం ఎప్పటికీ ప్రత్యేకమని చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement