నా ఉద్దేశంలో బెస్ట్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ అదే

Christopher Nolan talks about Satyajit Ray's Pather Panchali - Sakshi

ఫిల్మ్‌ ప్రిజర్వేషన్, ఫిల్మ్‌ పై సినిమాలు తీయడంలోని ప్రాముఖ్యత గురించిన ఈవెంట్‌లో పాల్గొనడానికి హాలీవుడ్‌ దర్శకుడు క్రిస్టోఫర్‌ నోలన్‌ ఇండియా వచ్చిన విషయం తెలిసిందే. ఈ వేడుకలో క్రిస్టోçఫర్‌ నోలన్‌ దర్శకత్వం వహించిన ‘ఇంటర్‌స్టెల్లార్, డంకర్క్‌’ సినిమాలను ప్రదర్శించారు. అలాగే నోలన్‌ కొన్ని ఇండియన్‌ సినిమాలు చూశారు. ఈ సందర్భంగా నోలన్‌ మాట్లాడుతూ –‘‘ఇండియన్‌ ఫిల్మ్‌ మేకర్స్‌ను కలవాలని, వాళ్ల స్టైల్‌ తెలుసుకోవాలని చాలాసార్లు అనుకున్నాను.

ఈ ప్రయాణం ద్వారా అది నెరవేరింది. ఈ విజిట్‌లో సత్యజిత్‌ రే తీసిన ‘పథేర్‌ పాంచాలి’ (1955) సినిమా చూశాను. నా దృష్టిలో ‘పథేర్‌ పాంచాలి’ బెస్ట్‌ ఇండియన్‌ ఫిల్మ్‌. దర్శకుడు సత్యజిత్‌ రే చేసిన ఎక్స్‌ట్రార్డినరీ వర్క్‌ ఇది. ఫ్యూచర్‌లో మరికొన్ని ఇండియన్‌ సినిమాలు చూడాలనుకుంటున్నాను. ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి ఉంది. ఇప్పుడు ఇండియాకు రావటానికి అది కూడా ఒక కారణమే’’ అని అన్నారాయన.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top