బ్రేకప్ తరువాత సంతోషంగా ఉన్నా | Chit chat with Simbu | Sakshi
Sakshi News home page

బ్రేకప్ తరువాత సంతోషంగా ఉన్నా

Sep 14 2014 12:38 AM | Updated on Sep 2 2017 1:19 PM

బ్రేకప్ తరువాత సంతోషంగా ఉన్నా

బ్రేకప్ తరువాత సంతోషంగా ఉన్నా

నటి హన్సికతో లవ్ బ్రేక్ అప్ అయిన తరువాత తాను బ్రహ్మాండంగా ఉన్నానంటున్నారు నటుడు శింబు. కోలీవుడ్‌లో ప్లేబాయ్‌గా ప్రచారం పొందిన యువ నటులలో శింబు ఒకరు.

నటి హన్సికతో లవ్ బ్రేక్ అప్ అయిన తరువాత తాను బ్రహ్మాండంగా ఉన్నానంటున్నారు నటుడు శింబు. కోలీవుడ్‌లో ప్లేబాయ్‌గా ప్రచారం పొందిన యువ నటులలో శింబు ఒకరు. నటి నయనతారతో గాఢమైన ప్రేమ, నటి హన్సికతో ప్రేమ, పెళ్లి అంటూ సంచలనాలకు కేంద్రబిందువుగా మారిన నటుడు శింబు. అయితే ఆ ఇద్దరితో ప్రేమ వర్కౌట్ కాకపోవడంతో మొదట్లో కొంత ఆవేదన చెందిన ప్రస్తుతం చాలా హ్యాపీగా ఉన్నానంటున్నారు. ప్రస్తుతం మాజీ ప్రేయసి నయనతారతో కలిసి ఇదునమ్మ ఆళు చిత్రంలో నటిస్తున్న శింబుతో చిట్‌చాట్.
 
  ఇదునమ్మ ఆళు చిత్రం పూర్వ వైభవాన్ని తెస్తుందా?
  నా చిత్రం కోసం ఎదురు చూస్తున్న నా అభిమానులకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను వరుసగా చిత్రాలు చేయాలనుకుంటున్నది వారి కోసమే. అదే విధంగా చిన్నతనం నుంచి ఈ రంగంలోనే ఉండటం వలన నాకు సినిమా తప్ప వేరేది తెలియదు. ఇక మీరడిన ప్రశ్నకు ఎలా సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదు. ఫలానా చిత్రం హిట్ అవుతుందని చెప్పలేను. అయితే నటుడిగా నా పాత్రకు న్యాయం చేయడానికి శాయశక్తులా శ్రమిస్తా. ఆ విధంగా నేను నటిస్తున్న ఇదు నమ్మ ఆళు, వాలు చిత్రాలు అభిమానులకు నచ్చుతాయనే నమ్మకం ఉంది.
 
  రెండేళ్లు గ్యాప్ రావడానికి కారణం?
  రెండు సంవత్సరాల గ్యాప్ అన్నది పెద్ద విషయం కాదు. నిజానికి ఈ రెండేళ్లలో నేను నాలుగు చిత్రాలు చేశాను. అయితే ఆ చిత్రాలు పలు కారణాల వలన నిలిచిపోయాయి. అన్నీ అనుకున్నట్లు జరగవు కదా. ఈ చిత్రాలను వరుసగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాను. వేట్టైమన్నన్ చిత్రం చాలా బాగా వస్తోంది. ఇంకా ఒక్క షెడ్యూల్ షూటింగ్ చేయాల్సి ఉంది. ఈ షెడ్యూల్‌ను విదేశాల్లో చిత్రీకరణకు ప్లాన్ చేస్తున్నాను.
 
  మీరు కరెక్ట్ టైమ్‌కు షూటింగ్ స్పాట్‌కు రారనే అపవాదు ఉందా?
  నిజమే. నేను షూటింగ్ స్పాట్‌కు ఆలస్యంగా వెళతాను. అయితే ఈ విషయంలో నేనెవరినీ మోసం చేయడం లేదు. ఉదయం ఏడు గంటలకు వస్తానని చెప్పి పదకొండు గంటలకు వెళ్లను. ఉదయం ఎప్పుడూ ఆలస్యంగానే షూటింగ్ స్పాట్‌కు వెళతాను. నా వర్కింగ్ స్టైల్ డిఫరెంట్‌గా ఉంటుందన్నది అందరికీ తెలిసిందే. దర్శకుడు సన్‌రైడ్ లాంటి షాట్స్ చిత్రీకరించాలంటే ఖచ్చితంగా టైమ్‌కు స్పాట్‌లో ఉంటాను.
 
 నటి హన్సికతో లవ్ బ్రేక్ అయినట్లు స్వయంగా ప్రకటించారు. ప్రస్తుతం ఒంటరి జీవితం ఎలా ఉంది?
 ఏ విషయమైనా నేను ఓపెన్‌గానే మాట్లాడుతాను. హన్సికతో రిలేషన్‌షిప్, ఆ తరువాత లవ్ బ్రేకప్ విషయాల గురించి విస్పష్టంగా వెల్లడించాను. కొన్ని కారణాల వలన రకరకాలుగా ప్రచారం జరగడం నా కిష్టం ఉండదు. మేమిద్దరం సుదీర్ఘంగా చర్చించుకుని తీసుకున్న నిర్ణయం కావడంతో నేనిప్పుడు చాలా సంతోషంగా ఉండగలుగుతున్నాను.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement