మోగింది సైరా శంఖారావం

Chiranjeevi's Sye Raa Narasimha Reddy starts shooting - Sakshi

స్వాతంత్య్రం, స్వేచ్ఛ, సమానత్వం పదాలు చిన్నవే. కానీ వీటి కోసం ఎందరో మహనీయులు చేసిన త్యాగాలు గొప్పవి. ఆ మహాను భావుల్లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు మొదటి వరుసలో ఉంటుంది. స్వాతంత్య్రం కోసం బ్రిటిషర్లపై పోరాడిన ప్రథమ స్వాతంత్య్ర సమర యోధునిగా చరిత్ర పుటల్లోకి ఎక్కారు ఉయ్యాలవాడ. ఆయన జీవిత చరిత్ర ఆధారంగా చిరంజీవి హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సైరా’. కొణిదెల ప్రొడక్షన్స్‌ పతాకంపై చిరంజీవి సతీమణి సురేఖ సమర్పణలో ఆయన తనయుడు రామ్‌చరణ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ బుధవారం మొదలైంది.

ప్రత్యేకంగా వేసిన సెట్‌లో ఈ నెల 22 వరకు షూటింగ్‌ జరుగుతుంది. హాలీవుడ్‌ ఫైట్‌ మాస్టర్‌ లీ విట్టేకర్‌ ఆధ్వర్యంలో కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తు న్నారు. రీల్‌ లైఫ్‌లో బ్రిటీషర్లపై చిరంజీవి తొలి సమర శంఖారావం మోగిందన్నమాట. ‘‘ ‘సైరా’ షూటింగ్‌ స్టార్ట్‌ అయ్యింది. మాకిది మెమొరబుల్‌ జర్నీ’’ అని చరణ్‌ పేర్కొన్నారు. ‘‘వెరీ ఎగై్జటెడ్‌ అబౌట్‌ ద జర్నీ ఆఫ్‌ అమేజింగ్‌ టీమ్‌’’ అన్నారు సురేందర్‌రెడ్డి. ఇదిలా ఉంటే.. ఫస్ట్‌ డే చిరంజీవి ఫొటోలు ఏవీ బయటకు రాలేదు. అయితే ఆయనది లేటెస్ట్‌ ఫొటో ఒకటి హల్‌చల్‌ చేసింది. పైన ఫొటో అదే. ఈ చిత్రానికి మాటలు: పరుచూరి బ్రదర్స్, కెమెరా: రత్నవేలు, ఆర్ట్‌: రాజీవ్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top