నా సినీ జీవితంలో గుర్తుండిపోయేలా.. : చిరంజీవి | Chiranjeevi Speech In SYE RAA Pre Release Event In Bangalore | Sakshi
Sakshi News home page

నా సినీ జీవితంలో గుర్తుండిపోయేలా.. : చిరంజీవి

Sep 29 2019 10:01 PM | Updated on Sep 30 2019 12:12 PM

Chiranjeevi Speech In SYE RAA Pre Release Event In Bangalore - Sakshi

బెంగళూరు : ‘రామ్‌ చరణ్‌ రెండో సినిమా మగధీరలో చేసిన క్యారెక్టర్‌ చూసీ జెలసీ ఫీలయ్యాను. నేను ఇన్ని సినిమాలు చేసినా.. ఇలా కత్తి పట్టుకుని చేసే అవకాశం నాకు రాలేదని చరణ్‌తో అన్నాను. ఆ తర్వాత దాన్ని వదిలేశాను. కానీ చరణ్‌లో ఆ ఆలోచన ఉండిపోయింది. అందుకే ఇప్పుడు సైరా నరసింహారెడ్డి రూపంలో చరణ్‌ నాకు పెద్ద గిప్ట్‌ అందజేశాడు. నా సినీ జీవితంలో గుర్తుండిపోయేలా.. ఈ సినిమాను నాకు బహుమతిగా ఇచ్చాడు. నేను ఏం సాధించానంటే రామ్‌ చరణ్‌ను సాధించానని గర్వంగా చెబుతాన’ని మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు. బెంగళూరులో ఆదివారం జరిగిన సైరా నరసింహారెడ్డి కన్నడ ప్రి రిలీజ్‌ ఈవెంట్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కర్ణాటక డిప్యూటీ సీఎం అశ్వత్ నారాయణ్, కన్నడ హీరో శివ రాజ్‌కుమార్‌, నిర్మాత రామ్‌చరణ్‌, హీరోయిన్‌ తమన్నా హాజరయ్యారు. 

ఇంకా చిరంజీవి ఏం మాట్లాడారో కింది వీడియోలో చూడండి..

కాగా, చిరంజీవి, నయనతార జంటగా అమితాబ్‌ బచ్చన్, జగపతిబాబు, తమన్నా, సుదీప్, విజయ్‌ సేతుపతి, రవికిషన్‌ ముఖ్య పాత్రల్లో రూపొందిన చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహించారు. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్‌ నిర్మించిన ఈ సినిమా అక్టోబర్‌ 2న విడుదలవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement