విజయ్‌ దేవరకొండకు సర్‌ప్రైజ్‌ | Chiranjeevi Likely to Attend Geetha Govindam Pre Release | Sakshi
Sakshi News home page

Aug 7 2018 9:05 AM | Updated on Aug 7 2018 9:06 AM

Chiranjeevi Likely to Attend Geetha Govindam Pre Release - Sakshi

సెన్సేషనల్‌ స్టార్‌ విజయ్‌ దేవరకొండకు సర్‌ప్రైజ్‌ లభించింది. విజయ్‌ హీరోగా నటించిన గీత గోవిందం ఈ నెల 15న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఇటీవలె విడుదలైన ఈ చిత్ర గీతాలకు మంచి స్పందన లభించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 12న ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను వైజాగ్‌లో నిర్వహించే యోచనలో టీమ్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఈవెంట్‌కు గెస్ట్‌గా మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నట్లు సమాచారం.

చిరు రాక విషయం తెలియగానే విజయ్‌ ఎంతో ఎగ్జైట్‌ అయినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రటకన వెలువడాల్సి ఉంది. ఇంతకు ఆడియో వేడుకకు స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ చీఫ్‌ గెస్ట్‌గా హాజరయ్యారు. విజయ్‌-రష్మిక మందన్న జంటగా రొమాంటిక్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా డైరెక్టర్‌ పరుశురాం గీత గోవిందాన్ని తెరకెక్కించాడు. గోపీ సుందర్‌ మ్యూజిక్‌ అందిచగా.. గీతా ఆర్ట్స్‌-2 బ్యానర్‌పై చిత్రం రూపుదిద్దుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement