బాహుబలి 2పై మెగాస్టార్ కామెంట్స్ | Chiranjeevi Comments on Baahubali 2 | Sakshi
Sakshi News home page

బాహుబలి 2పై మెగాస్టార్ కామెంట్స్

Apr 30 2017 11:37 AM | Updated on Jul 14 2019 4:05 PM

బాహుబలి 2పై మెగాస్టార్ కామెంట్స్ - Sakshi

బాహుబలి 2పై మెగాస్టార్ కామెంట్స్

ప్రపంచ వ్యాప్తంగా సంచలనాలు నమోదు చేస్తున్న బాహుబలి యూనిట్ను మెగాస్టార్ చిరంజీవి ప్రశంసించాడు. 'బాహుబ‌లి- ది కంక్లూజ‌న్

ప్రపంచ వ్యాప్తంగా సంచలనాలు నమోదు చేస్తున్న బాహుబలి యూనిట్ను మెగాస్టార్ చిరంజీవి ప్రశంసించాడు. 'బాహుబ‌లి- ది కంక్లూజ‌న్ ఒక అద్భుతం.. ఆ అద్భుతాన్ని సృష్టించిన రాజ‌మౌళి అభినంద‌నీయుడు. తెలుగు సినిమా స‌త్తా దేశ విదేశాల్లో చాటిన అద్భుత శిల్పికి హెట్సాఫ్‌. బాహుబలిలో న‌టించిన ప్రభాస్‌, రానా, ర‌మ్యకృష్ణ‌, అనుష్క‌, స‌త్యరాజ్, నాజ‌ర్‌ ఇతర న‌టీన‌టులతో పాటు ప్రత్యేకంగా విజ‌యేంద్రప్రసాద్‌, కీర‌వాణి గారికి, సెంథిల్‌కి, మిగిలిన సాంకేతిక నిపుణుల‌కు నా ప్రత్యేక అభినంద‌నలు.  జ‌య‌హో... రాజమౌళి' అంటూ యూనిట్ సభ్యులను ఆకాశానికి ఎత్తేశారు.

గురువారం రాత్రి ప్రీమియర్ షోలతో ప్రారంభమైన బాహుబలి 2 ప్రభంజనం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. తొలి రోజే 200 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఒక్క ఇండియన్ మార్కెట్ లోనే 125 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్టు ప్రముఖ బాలీవుడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ప్రకటించారు. లాంగ్ వీకెండ్ కూడా కావటంతో మరో మూడు రోజుల పాటు బాహుబలి 2 మరిన్ని రికార్డ్లు నమోదు చేసే అవకాశం ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement