చిరు చాలెంజ్‌.. ఎవరికో తెలుసా? | Chiranjeevi Accepted Green Challenge And Thrown Others | Sakshi
Sakshi News home page

Jul 31 2018 2:38 PM | Updated on Mar 22 2019 5:33 PM

Chiranjeevi Accepted Green Challenge And Thrown Others - Sakshi

హరిత హారం కార్యక్రమంలో భాగంగా గ్రీన్‌ చాలెంజ్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతోంది. బడా బడా పొలిటీషయన్లతోపాటు సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు కూడా ఇందులో పాల్గొని ఒకరికొకరు సవాళ్లు విసురుకుంటున్నారు. కేటీఆర్‌, కవిత, సచిన్‌, రాజమౌళి, మహేష్‌ బాబు లాంటి ప్రముఖులు ఇప్పటికే ఇందులో పాల్గొన్నారు కూడా. తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి కూడా ఇందులో పాల్గొని మరికొందరికి సవాల్‌ వేశారు. 

ఎన్టీవీ ఛానెల్‌ అధినేత నరేంద్ర చౌదరి విసిరిన సవాల్‌ను స్వీకరించిన చిరు.. ఇంట్లో మూడు మొక్కలు నాటి కొందరిని నామినేట్‌ చేశారు. బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌తోపాటు, మీడియా దిగ్గజం రామోజీరావు, సోదరుడు పవన్‌ కల్యాణ్‌కు గ్రీన్‌ చాలెంజ్‌ విసిరారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన సురేందర్‌ రెడ్డి డైరెక్షన్‌లో సైరా నరసింహారెడ్డి చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది సమ్మర్‌లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement