చిరు152షురూ | chiranjeevi 152 movie opening | Sakshi
Sakshi News home page

చిరు152షురూ

Oct 10 2019 2:21 AM | Updated on Oct 10 2019 4:49 AM

chiranjeevi 152 movie opening - Sakshi

చిరంజీవి, రామ్‌చరణ్, నిరంజన్‌ రెడ్డి, కొరటాల శివ

‘ఖైదీ నంబర్‌ 150, సైరా నరసింహారెడ్డి’ వంటి బ్లాక్‌ బస్టర్‌ చిత్రాల తర్వాత చిరంజీవి హీరోగా నటిస్తున్న 152వ సినిమాకి కొబ్బరికాయ కొట్టారు. డిఫరెంట్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్స్‌తో వరుస బ్లాక్‌ బస్టర్స్‌ను సొంతం చేసుకున్న కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాని దసరా పండుగను పురస్కరించుకుని హైదరాబాద్‌లో మంగళవారం ప్రారంభించారు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై రామ్‌చరణ్, నిరంజన్‌ రెడ్డి నిర్మిస్తున్నారు.

పూజా కార్యక్రమాల అనంతరం దేవుడి చిత్రపటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి చిరంజీవి సతీమణి సురేఖ క్లాప్‌ ఇచ్చారు. ‘‘ఈ సినిమాలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో తెలియజేస్తాం. సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ త్వరలోనే మొదలుకానుంది’’ అని చిత్ర యూనిట్‌ పేర్కొంది. ఈ కార్యక్రమంలో చిరంజీవి తల్లి అంజనాదేవి, హీరో రామ్‌చరణ్, నిరంజన్‌ రెడ్డి, చిరంజీవి కుమార్తె సుస్మిత తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: తిరు.

Advertisement