ఫుల్ ఖుష్! | Chiranjeevi 150th Film Confirmed Its Remake of Kaththi | Sakshi
Sakshi News home page

ఫుల్ ఖుష్!

Apr 23 2016 11:33 PM | Updated on Jul 25 2018 3:25 PM

ఫుల్ ఖుష్! - Sakshi

ఫుల్ ఖుష్!

చిరంజీవి 150వ చిత్రం... ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? హీరోయిన్ ఎవరు...? ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఇవన్నీ అభిమానులను తొలిచేస్తున్న ప్రశ్నలు.

చిరంజీవి 150వ చిత్రం... ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? హీరోయిన్ ఎవరు...? ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఇవన్నీ అభిమానులను తొలిచేస్తున్న ప్రశ్నలు. వీవీ వినాయక్ దర్శకత్వంలో తమిళ ‘కత్తి’ రీమేక్‌తో గ్రాండ్‌గా రీ-ఎంట్రీ ఇవ్వడానికి చిరు సిద్ధమవుతున్నారని తెలిసినప్పటి నుంచి ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్ర మాతృక కథ మీద వివాదం చెలరేగడంతో కొంత కాలం హాట్ టాపిక్‌గా మారింది.
 
  వీవీ వినాయక్ మాత్రం తెలుగు నేటివిటీకి అనుగుణంగా ఈ సినిమా స్క్రిప్ట్‌ను తీర్చిదిద్ది, చిరంజీవికి  కూడా వినిపించారని సమాచారం. స్క్రిప్ట్ విన్న చిరంజీవి ఫుల్ ఖుష్ అయిపోయి, వినాయక్‌ను హగ్ చేసుకున్నారట. ఇంకేముంది? ఇక  చిత్రీకరణ మొదలుపెట్టడమే ఆలస్యం. ఈ చిత్రాన్ని హీరో రామ్‌చరణ్ నిర్మించనున్న విషయం తెలిసిందే. కథానాయికగా నయనతార పేరు వినపడుతోంది.
 

Advertisement
 
Advertisement
Advertisement