సమాజం మానవతా విలువలను మరచిపోతోంది. ఆరుగురు చిన్నారులు ఆ విలువలను ఏ విధంగా కాపాడారు?
సమాజం మానవతా విలువలను మరచిపోతోంది. ఆరుగురు చిన్నారులు ఆ విలువలను ఏ విధంగా కాపాడారు? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘లిటిల్ స్టార్స్’. రషీద్ బాషా దర్శకత్వంలో మాస్టర్ మహమ్మద్ అఫ్పాన్స్ సమర్పణలో హెచ్.డి. విజన్ ఇండియా, అనంతపురం ఫిల్మ్ సొసైటీ సంయు క్తంగా నిర్మించిన చిత్రం ఇది. పాటలను డిసెంబర్ మొదటి వారంలో విడుదల చేయనున్నారు. ‘‘పిల్లల్లో మేధాశక్తి పెంపొందించడానికి పర్యవేక్షణతో కూడిన స్వేచ్ఛ ఇవ్వాలి. అప్పుడే వాళ్లు అద్భుతాలు సాధించగలరనే సందేశాన్ని ఈ చిత్రంతో చెబుతున్నాం’’ అని నిర్మాత అన్నారు.