Manasvi Kottachi: బేబీ మనస్వి | Little Star Manasvi Kottachi | Sakshi
Sakshi News home page

Manasvi Kottachi: బేబీ మనస్వి

Nov 10 2024 8:05 AM | Updated on Nov 10 2024 8:05 AM

Little Star Manasvi Kottachi

వారసత్వంగా పరిచయమై కొంతమంది పేరు తెచ్చుకుంటే.. మరి కొంతమంది తమ ప్రతిభతో కుటుంబానికి వన్నె తెస్తారు. అలాంటి వారిలో బాల నటి మనస్వి కొట్టాచ్చి ఒకరు. చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి ఎంటరై, తండ్రికే పోటీ ఇచ్చి, వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ఈ లిటిల్‌ స్టార్‌ గురించి∙ కొన్ని విషయాలు..

నాన్‌వెజ్‌ అంటే చాలా ఇష్టం. రకరకాల నాన్‌వెజ్‌ ఐటమ్స్‌ తినొచ్చనే నాన్నతో కలిసి షూటింగ్స్‌కు వెళ్లేదాన్ని. కానీ ఇప్పుడు అలా కాదు నటనపై ఇష్టం, ప్రేమతో పాటు సీరియస్‌నెస్‌ కూడా పెరిగింది.
– మనస్వి కొట్టాచ్చి.

∙చెన్నైలో పుట్టి, పెరిగిన మనస్వి తమిళ హాస్య నటుడు కొట్టాచ్చి కుమార్తె. కొట్టాచ్చి తమిళ సినీరంగంలో మంచి గుర్తింపు పొందాడు.

తనకు ఊహ తెలిసినప్పటి నుంచి సినీ ప్రపంచంలోనే ఉంది మనస్వి. మూడేళ్ల వయసులో ‘సూపర్‌ డాడీ’ టీవీ షో ద్వారా తొలిసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

చెన్నైలో పుట్టి, పెరిగిన మనస్వి తమిళ హాస్య నటుడు కొట్టాచ్చి కుమార్తె. కొట్టాచ్చి తమిళ సినీరంగంలో మంచి గుర్తింపు పొందాడు.

ఈ చిన్నారి నటనకు ముచ్చటపడిన మలయాళ చిత్రపరిశ్రమా చక్కటి అవకాశాలను ఇచ్చింది. అందులో ఒకటే  ‘మై శాంటా’ మూవీ. ఇందులో ఆమెది ప్రధాన పాత్ర.  శ్రీమణి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హారర్‌ చిత్రం ‘కన్మణి పాప’లోనూ ముఖ్య భూమికే!  

తర్వాత  ‘ఇమైక్క నొడిగళ్‌’ అనే చిత్రం ద్వారా బాలనటిగా సినీరంగ ప్రవేశం చేసింది. ఇందులో నయనతార కుమార్తెగా నటించింది. ఇది ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. ఆపై ‘దర్బార్‌’, ‘మామణిదన్‌’, ‘చంద్రముఖి–2’ వంటి సినిమాల్లోనూ 
నటించింది.

మనస్వి నటించిన ‘మామణిదన్‌’ను  ఢిల్లీ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో  ప్రదర్శించారు. దాని ఫలితంగా మనస్వికి బాలీవుడ్‌లోనూ చాన్స్‌ వచ్చింది. ఆమె నటించిన  హిందీ సినిమా ‘బేబీ కాజల్‌’ విడుదలకు సిద్ధంగా ఉంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement