'శివాయ్' లేటెస్ట్ పోస్టర్ | Check out the latest poster of Ajay Devgn's 'Shivaay' | Sakshi
Sakshi News home page

'శివాయ్' లేటెస్ట్ పోస్టర్

Aug 5 2016 7:16 PM | Updated on Sep 4 2017 7:59 AM

'శివాయ్' లేటెస్ట్ పోస్టర్

'శివాయ్' లేటెస్ట్ పోస్టర్

బాలీవుడ్ స్టార్ హీరో అజయ్‌ దేవగన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక సినిమా 'శివాయ్‌'.

బాలీవుడ్ స్టార్ హీరో అజయ్‌ దేవగన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక సినిమా 'శివాయ్‌'. దీపావళి పండుగకు విడుదల కాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఫస్ట్ లుక్తో అభిమానుల్లో ఆసక్తిని కలిగించిన అజయ్.. తాజాగా మరో పోస్టర్ను తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా రిలీజ్ చేశాడు.

ఏదో ఉపద్రవం నుంచి తప్పించుకుంటున్నట్టు, సాహసోపేతమైన పోరాటం చేస్తున్నట్టుగా ఆ పోస్టర్లో కనిపిస్తోంది. ఆగస్టు 7 వ తేదీన ట్రైలర్ శివాయ్ విడుదల కానుంది. శివాయ్లో సల్మాన్ ఓ స్పెషల్ సాంగ్లో మెరవనున్నారని టాక్. ఈ సినిమాతో 'అఖిల్' ఫేమ్ సయ్యేషా సెహగల్ బాలీవుడ్లో తెరంగేట్రం చేస్తుంది.

 

Advertisement
 
Advertisement
Advertisement