breaking news
Latest poster
-
రెడ్ కలర్ శారీలో ఎర్ర గులాబీల మెరిసిపోతున్న అనన్య నాగళ్ల (ఫొటోలు)
-
'ఆర్ఆర్ఆర్' ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్.. రోలింగ్ లేనప్పుడు స్క్రోలింగ్
RRR Movie Latest Photo NTR Ram Charan Released By Makers: ఓటమెరుగని దర్శక ధీరుడు రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌ల భారీ మల్టీ స్టారర్ చిత్రం 'ఆర్ఆర్ఆర్'. ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు, ప్రేక్షకుల ఈ మోస్ట్ అవేయిటెడ్ చిత్రం వరల్డ్ వైడ్‌గా మార్చి 25న విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సంవత్సరం జనవరి 7న విడుదల కావాల్సింది. కానీ అనేక కారణాలతో అనేకసార్లు వాయిదా పడిన ఈ చిత్రాన్ని మార్చి 25న రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. రిలీజ్ డేట్ సమీపిస్తుండటంతో సినిమా ప్రమోషన్స్ పెంచేసింది జక్కన్న టీం. మంగళవారం మహా శివరాత్రి సందర్భంగా ఆర్ఆర్ఆర్ అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చింది. సినిమా షూటింగ్ లేనప్పుడు రామ్-భీమ్‌లు ఇద్దరూ ఎలా ఉంటారనేది చెబుతూ పోస్టర్ విడుదల చేసింది. ఈ పోస్టర్లో పచ్చటి గడ్డిపై ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ మ్యాట్లు వేసుకుని పడుకుని ఉన్నారు. అంతేకాకుండా వారు తమ మొబైల్స్ చేతిలో పట్టుకొని ఏదో స్క్రోలింగ్ చేస్తూ దర్శనిమిచ్చారు. ఈ పోస్టర్‌కు 'కెమెరా రోలింగ్లో లేనప్పుడు స్క్రోలింగ్' అని క్యాప్షన్ ఇచ్చారు. అయితే సినిమాల్లో నవరసాలు పండించే ఈ హీరోలు షూటింగ్ లేనప్పుడు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ కాగా ఫ్యాన్స్ వారి హీరోలను చూస్తూ మురిసిపోతున్నారు. Scrolling when camera isn’t Rolling 👻 #RRRMovie#MaRRRchIsHere 🔥🌊 pic.twitter.com/Rh9xYKhVGL — RRR Movie (@RRRMovie) March 1, 2022 -
'శివాయ్' లేటెస్ట్ పోస్టర్
బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక సినిమా 'శివాయ్'. దీపావళి పండుగకు విడుదల కాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఫస్ట్ లుక్‌తో అభిమానుల్లో ఆసక్తిని కలిగించిన అజయ్.. తాజాగా మరో పోస్టర్‌ను తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా రిలీజ్ చేశాడు. ఏదో ఉపద్రవం నుంచి తప్పించుకుంటున్నట్టు, సాహసోపేతమైన పోరాటం చేస్తున్నట్టుగా ఆ పోస్టర్లో కనిపిస్తోంది. ఆగస్టు 7 వ తేదీన ట్రైలర్ శివాయ్ విడుదల కానుంది. శివాయ్లో సల్మాన్ ఓ స్పెషల్ సాంగ్‌లో మెరవనున్నారని టాక్. ఈ సినిమాతో 'అఖిల్' ఫేమ్ సయ్యేషా సెహగల్ బాలీవుడ్లో తెరంగేట్రం చేస్తుంది. 2 Days To Shivaay Trailer. Sharing with you all on 7th August. pic.twitter.com/Tj0cG3qB8O — Ajay Devgn (@ajaydevgn) 5 August 2016