సీనియర్ నటుడు షణ్ముగ సుందరం మృతి | character artiste Shanmuga Sundaram passes away | Sakshi
Sakshi News home page

సీనియర్ నటుడు షణ్ముగ సుందరం మృతి

Aug 15 2017 12:22 PM | Updated on Sep 28 2018 3:41 PM

సీనియర్ నటుడు షణ్ముగ సుందరం మృతి - Sakshi

సీనియర్ నటుడు షణ్ముగ సుందరం మృతి

కొంత కాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న కోలీవుడ్ సీనియర్ నటుడు షణ్ముగ సుందరం కన్నుమూసారు.

కొంత కాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న కోలీవుడ్ సీనియర్ నటుడు షణ్ముగ సుందరం (77) ఈ రోజు (15-08-2017) ఉదయం కన్నుమూసారు. సాలిగ్రామంలోని తన ఇంట్లో ఆయన తుది శ్వాస విడిచారు. నాటకాల్లో హిట్లర్ పాత్రలో ఆయన నటన చూసిన శివాజీ గణేషన్ ఆయనకు సినీ రంగంలో అవకాశం ఇచ్చారు.

1963లో రిలీజ్ అయిన రథ తిలగం సినిమాతో వెండితెరకు పరిచయం అయిన సుందరం క్యారెక్టర్ ఆర్టిస్ట్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. శింబు హీరోగా తెరకెక్కిన అన్బనవన్ అసరధవన్ అదంగధవన్ ఆయన చివరి చిత్రం. నటి రాధిక శరత్ కుమార్ నటించిన నిర్మించిన అన్నామలై, సెల్వి లాంటి సీరియల్స్ లోనూ నటించారు సుందరం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement