హిట్‌ అనుకున్నాం.. సూపర్‌ హిట్‌ అయ్యింది – నాగశౌర్య | Chalo Movie Thanks Meet | Sakshi
Sakshi News home page

హిట్‌ అనుకున్నాం.. సూపర్‌ హిట్‌ అయ్యింది – నాగశౌర్య

Feb 5 2018 2:01 AM | Updated on Feb 5 2018 2:01 AM

Chalo Movie Thanks Meet  - Sakshi

నాగశౌర్య, గౌతమ్, ఉషా, రష్మిక మండన్న, శంకర్‌ ప్రసాద్, వెంకీ కుడుముల

‘‘ఛలో’ ఓ ఎమోషనల్‌ జర్నీ. మంచి సినిమా తీశాం. హిట్‌ అవుతుందని అనుకున్నాం. కానీ పెద్ద హిట్‌.. సూపర్‌హిట్‌ అయ్యింది. టికెట్లు దొరకడం లేదని కొందరు నన్ను టికెట్లు అడుగుతుంటే ‘వీళ్లు కావాలనే అడుగుతున్నారా.. లేకుంటే నిజంగానే పెద్ద హిట్‌ అయ్యిందా అన్నది అర్థం కావడం లేదు’’ అని నాగశౌర్య అన్నారు. నాగశౌర్య, రష్మిక మండన్న జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఛలో’. శంకర్‌ప్రసాద్‌ మూల్పూరి సమర్పణలో ఉషా మూల్పూరి నిర్మించిన ఈ సినిమా ఇటీవల విడుదలైంది.

ఈ సందర్భంగా హైదరాబాద్‌లో థ్యాంక్స్‌ మీట్‌ నిర్వహించారు. నాగశౌర్య మాట్లాడుతూ– ‘‘ఛలో’ సినిమాకి నేనొక్కడినే బలం కాదు. నా తోటి నటీనటులు, సాంకేతిక నిపుణులందరూ. నాకు మా అమ్మానాన్న బలమైతే.. ఐరా క్రియేషన్స్‌కి బుజ్జి అంకుల్, శ్రీనివాసరెడ్డి అంకుల్‌ ఇద్దరే బలం. మరో నాలుగు సినిమాలు తీయొచ్చనే ధైర్యం ఇచ్చింది వారిద్దరే. ‘ఛలో’ని బాగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు’’ అన్నారు.

‘‘ఈ రోజుల్లో డైరెక్టర్‌గా అవకాశం దొరకడం ఎంత కష్టమో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన నాకు తెలుసు. అటువంటిది నన్ను నమ్మి, సొంత ప్రొడక్షన్‌ స్టార్ట్‌ చేసి నాకు ఈ అవకాశం ఇచ్చిన నాగశౌర్యకు జీవితాంతం రుణపడి ఉంటాను. ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం ఉషా ఆంటీ, శంకర్‌ప్రసాద్‌ అంకుల్‌. మిమ్మల్ని జీవితంలో మరచిపోలేను. శౌర్య, రష్మిక చాలా బాగా చేశారు’’ అన్నారు వెంకీ కుడుముల. ‘‘ఛలో’ సినిమాని ఆదరించడంతో పాటు నన్ను బాగా సపోర్ట్‌ చేసిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు. మీ ఆదరాభిమానాలు ఎప్పుడూ ఇలాగే ఉండాలి’’ అన్నారు రష్మిక మండన్న. శంకర్‌ప్రసాద్, ఉషా, కెమెరామ్యాన్‌ సాయి శ్రీరామ్, గౌతమ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement