కోలీవుడ్‌లో కేరాఫ్‌ కంచరపాలెం రీమేక్‌

Care Of Kancharapalem Remake in Kollywood - Sakshi

సినిమా: తెలుగులో చిన్న చిత్రంగా విడుదలై మంచి విజయాన్ని అందుకున్న చిత్రం కేరాఫ్‌ కంచరపాలెం. ఈ చిత్రం ఇప్పుడు తమిళంలో పునర్‌ నిర్మాణం కానుంది. శ్రీ షిరిడీ సాయి మూవీస్‌ పతాకంపై ఎం.రాజశేఖర్‌రెడ్డి, జీవన్‌  కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి హేమంబర్‌ జాస్తీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర వివరాలను ఆయన తెలుపుతూ తెలుగులో మంచి విజయాన్ని సాధించిన కేరాఫ్‌ కంచరపాలెం చిత్రాన్ని తమిళ నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు, చేర్పులు చేసి చేయనున్నామని చెప్పారు. ఈ చిత్రంలోని ప్రతి సన్నివేశాన్ని చాలా జాగ్రత్తగా తెరకెక్కించాల్సి ఉంటుందన్నారు. కారణం ఇది నిజజీవితంలో జరి గే సంఘటనల ఆధారంగా తయారు చేసిన కథ అని తెలిపారు.

ఇందులోని సంఘటనలు, నిజ జీవితంలో నిత్యం మనకు తారసపడేవేనని అన్నా రు. చిత్రం చూసిన ప్రేక్షకులు అందులోని పాత్రల్లో తమను ఊహించుకుంటారన్నారు. కాగా చిత్రం ఆధ్యంతం జనరంజకంగా ఉంటుందని చెప్పారు. ఇటీవలే పూజా కార్యక్రమాలను నిర్వహించన ఈ చిత్రంలో నటించే నటీనటులు, సాంకేతిక వర్గం ఎంపిక జరుగుతోందని, త్వరలోనే చిత్రీకరణను ప్రారంభింనున్నట్లు తెలిపారు. దీనికి స్వీకర్‌ అగస్తీ సంగీతాన్ని అందిస్తుండగా, గుణశేఖరన్‌ ఛాయాగ్రహణం అందిస్తున్నట్లు చెప్పారు. మహా వెంకటేశ్‌ కథా సహకారాన్ని, నీలన్‌ సంభాషణలను, కపిలన్‌ పాటలను రాస్తున్నట్లు చెప్పారు. కాగా తెడియపల్లి మదన్‌ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top