రెండో బెల్‌కు రంగం సిద్ధం! | Calling Bell movie sequel | Sakshi
Sakshi News home page

రెండో బెల్‌కు రంగం సిద్ధం!

Jun 1 2016 10:55 PM | Updated on Sep 4 2017 1:25 AM

వ్రితి ఖన్నా, రవి వర్మ ముఖ్యతారలుగా గతేడాది రూపొందిన ‘కాలింగ్ బెల్’ చిత్రానికి సీక్వెల్ రానుంది. ప్రీక్వెల్‌ను తెరకెక్కించిన

వ్రితి ఖన్నా, రవి వర్మ ముఖ్యతారలుగా గతేడాది రూపొందిన ‘కాలింగ్ బెల్’ చిత్రానికి సీక్వెల్ రానుంది. ప్రీక్వెల్‌ను తెరకెక్కించిన పన్నా రాయల్ ఈ సీక్వెల్‌కు దర్శకుడు. అశోక్‌రాజ్, రాజ్ దలవాయి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. నిర్మాతలు మాట్లాడు తూ-‘‘ ‘కాలింగ్‌బెల్’ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించిన పన్నా రాయల్ ఈ సీక్వెల్‌ను హై టెక్నికల్ స్టాండర్డ్స్‌తో నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ నెలలోనే షూటింగ్ ప్రారంభిస్తాం’’ అని చెప్పారు. ‘‘దర్శకునిగా ‘కాలింగ్‌బెల్’ మంచి పేరు తీసుకొచ్చింది. అందుకే, కొంత టైమ్ తీసుకుని సీక్వెల్ కోసం పక్కాగా స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాను’’ అని పన్నా రాయల్ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement