హైజాక్ ఇతివృత్తంగా బస్ 657 | Bus 657 Hollywood movie | Sakshi
Sakshi News home page

హైజాక్ ఇతివృత్తంగా బస్ 657

Feb 24 2016 2:31 AM | Updated on Aug 16 2018 4:36 PM

హైజాక్ ఇతివృత్తంగా బస్ 657 - Sakshi

హైజాక్ ఇతివృత్తంగా బస్ 657

హైజాక్ నేపథ్యంగా ఇంతకు ముందు పలు భాషల్లో పలు చిత్రాలు తెరపైకొచ్చి ఆడియన్స్‌ను థ్రిల్‌కు గురి చేశాయి.

హైజాక్ నేపథ్యంగా ఇంతకు ముందు పలు భాషల్లో పలు చిత్రాలు తెరపైకొచ్చి ఆడియన్స్‌ను థ్రిల్‌కు గురి చేశాయి. తాజాగా బస్ 657 పేరుతో హాలీవుడ్ చిత్రం రానుంది. ఇది అమెరికన్ క్రైమ్ థ్రిల్లర్ కథా చిత్రంగా రూపొందింది. ఇంతకు ముందు టోర్నమెంట్ వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాలను తెరకెక్కించిన స్కాట్‌మన్ ఈ బస్ 657 చిత్రానికి సృష్టి కర్త. ఇంపాజిబుల్ ఫిలింస్ సంస్థ నిర్మించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం బస్ హైజాక్ ఇతి వృత్తంతో రూపొందింది.
 
  అనారోగ్యంతో బాధ పడుతున్న తన కూతుర్ని రక్షించుకోవడానికి డబ్బు కోసం ఓ తండ్రి తన సహచరుడితో కలిసి ఒక బస్‌ను హైజాక్ చేస్తాడు. ఈ నేపథ్యంలో జరిగే పలు ఆసక్తికరమైన సంఘటనల సమాహారంగా బస్ 657 చిత్రం ఉంటుందని చిత్ర వర్గాలు పేర్కొన్నారు. ఇందులో జఫ్రీడిన్ మార్గన్, క్యాట్ బోస్వర్త్, మోరిస్‌చెస్ట్‌నట్ ప్రధాన పాత్రలు పోషించారు.చిత్రం మార్చి 11న దేశ వ్యాప్తంగా ఆంగ్లం,తమిళం,తెలుగు భాషల్లో విడుదల కానుంది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement