బుల్లెట్ రాణిగా వస్తున్న లేడీ గబ్బర్ సింగ్! | 'Bullet Rani' not spoof on 'Gabbar Singh', says Director | Sakshi
Sakshi News home page

బుల్లెట్ రాణిగా వస్తున్న లేడీ గబ్బర్ సింగ్!

Sep 2 2014 12:38 PM | Updated on Sep 2 2017 12:46 PM

బుల్లెట్ రాణిగా వస్తున్న లేడీ గబ్బర్ సింగ్!

బుల్లెట్ రాణిగా వస్తున్న లేడీ గబ్బర్ సింగ్!

పవన్ కల్యాణ్ గబ్బర్సింగ్ స్ఫూర్తితో తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి 'బుల్లెట్ రాణి' చిత్రం రాబోతోంది.

పవన్ కల్యాణ్ గబ్బర్సింగ్ స్ఫూర్తితో తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి 'బుల్లెట్ రాణి' చిత్రం రాబోతోంది. ఇది గబ్బర్ సింగ్ సినిమాకు మక్కీకి మక్కీ కాపీ కాదని, అయితే.. ఈ సినిమాలో హీరోయిన్ నిషా కొఠారీ పాత్రను మాత్రం గబ్బర్ సింగ్లో పవర్ఫుల్ పోలీసు అధికారి పాత్రలో పవన్ కల్యాణ్ నటించిన తీరు స్ఫూర్తితోనే రూపొందించినట్లు ఈ చిత్ర దర్శకుడు సురేష్ గోస్వామి తెలిపారు. ఇందులో నిషా కొఠారీ కూడా పవర్ఫుల్ పోలీసు అధికారిణి పాత్రంలో నటిస్తోంది.

తన సినిమాను గబ్బర్ సింగ్ ఫిమేల్ వెర్షన్ అంటే ఏమీ బాధపడను గానీ, అది మాత్రం కాపీ కాదని ఆయన చెప్పారు. నిషా పాత్రను మాత్రం పవన్ స్ఫూర్తితోనే రూపొందించామన్నారు. మహిళను బలమైన పోలీసు అధికారిణిగా చూపించేందుకే ప్రయత్నించామని ఆయన చెప్పారు. నిషా కొఠారీ పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెకు ఈ సినిమాతో మంచి ఇమేజ్ వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నిషా చాలా ప్రతిభావంతురాలైన నటి అని, ఇప్పుడు బుల్లెట్ రాణి సినిమాలో ఆమె చాలా విభిన్నంగా కనిపిస్తుందన్న నమ్మకం తనకుందని సురేష్ గోస్వామి అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement