బుల్లితెరపై బ్రహ్మానందం!

Brahamanadam Comedy Show In Star Maa - Sakshi

బ్రహ్మానందం పేరు వింటేనే హాస్యం పుడుతుంది. ఆయన తెరపై కనబడితే నవ్వుల పూలు పూస్తాయి. ఒకప్పుడు ఈయన పాత్ర లేని సినిమాలు ఉండేవి కాదు. పెద్ద హీరోల సినిమాల్లో బ్రహ్మానందం పాత్రను స్పెషల్‌గా డిజైన్‌ చేసేవారు దర్శకులు. ఒక్కోసారి హీరోల పాత్రను డామినేట్‌ చేసేంతగా.. ఆ సినిమా సక్సెస్‌లో పాలుపంచుకున్నారు. 

అయితే ఇదంతా గతం. ప్రస్తుతం ప్రేక్షకులు కొత్త తరహా కామెడీని ఆస్వాదించేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు. ఒకే తరహా పాత్రలు చేస్తే సినీ అభిమానులు స్వీకరించడం లేదు. దీనికి తోడు యంగ్‌ జనరేషన్‌ కమెడియన్స్‌ సత్తా చాటుతున్నారు. దీంతో ఈ మధ్య బ్రహ్మానందం చేస్తోన్న సినిమాలు అంతగా విజయం సాధించకపోవడం, అందులోని కామెడీ కూడా వర్కౌట్‌ కాకపోవడంతో బ్రహ్మానందం కాస్త విరామం తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. 

వెండితెరపై హాస్యాన్ని పండించిన నవ్వుల రారాజు బ్రహ్మానందం.. ఇక నుంచి బుల్లితెరపై తన హాస్య చతురతను ప్రదర్శించడానికి రెడీ అవుతున్నారు. బుల్లి తెరపై హాస్య ప్రధానమైన కార్యక్రమాలు ఏ రేంజ్‌లో విజయం సాధిస్తున్నాయో తెలిసిందే. స్టార్‌ మాలో ప్రసారం కానున్న ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ప్రోమోతో ఆకట్టుకుంటోన్న ఈ షో.. త్వరలో ప్రారంభం కానున్నట్లు తెలిపారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top