భార్య ఇంటికి వెళ్లేందుకు హీరోకు షరతు | Brad Pitt to have drug tests in deal with Jolie to see kids | Sakshi
Sakshi News home page

భార్య ఇంటికి వెళ్లేందుకు హీరోకు షరతు

Oct 1 2016 8:32 AM | Updated on Sep 4 2017 3:48 PM

భార్య ఇంటికి వెళ్లేందుకు హీరోకు షరతు

భార్య ఇంటికి వెళ్లేందుకు హీరోకు షరతు

హాలీవుడ్ జంట బ్రాడ్ పిట్, ఏంజెలినా జోలీ తాత్కాలిక ఒప్పందం చేసుకున్నారు.

విడిపోవాలని నిర్ణయించుకుని విడాకులకు దరఖాస్తు చేసుకున్న హాలీవుడ్ జంట బ్రాడ్ పిట్, ఏంజెలినా జోలీ తాత్కాలిక ఒప్పందం చేసుకున్నారు. బ్రాడ్ పిట్ డ్రగ్, ఆల్కాహల్ పరీక్షలు చేయించుకున్న తర్వాతే తన పిల్లలను చూసేందుకు వెళ్లాలనే షరతును ఈ ఒప్పందంలో చేర్చారు. దీనికి పిట్, జోలీ ఇద్దరూ అంగీకరించారు.

ప్రస్తుతం జోలీ పిట్కు దూరంగా అద్దె ఇంట్లో ఉంటోంది. ఆరుగురు పిల్లలు ఆమె దగ్గరే ఉన్నారు. పిట్, జోలీకి ముగ్గురు సంతానం కాగా, మరో ముగ్గురిని దత్తత తీసుకున్నారు. ఇటీవల పిట్ మద్యంమత్తులో పిల్లల పట్ల అనుచితంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ జోలీ విడిపోయింది. గత నెల 20న విడాకులకు దరఖాస్తు చేసుకుంది. ఇది కోర్టు విచారణలో ఉంది. గత నెల 15న జోలీ దూరమయ్యాక పిట్ ఇప్పటి వరకు పిల్లలను చూడలేదు. దీంతో వీరిద్దరూ శుక్రవారం తాత్కాలిక ఒప్పందం చేసుకున్నారు. ఈ నెల 20 వరకు ఇది అమల్లో ఉంటుంది. పిల్లల క్షేమంగా దృష్ట్యా తన వద్దే ఉంచుకున్నట్టు జోలీ చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement