శ్రీదేవి బయోపిక్‌ తీయనున్న బోనీ ! | Boney Kapoor To Make A Biopic On Sridevi | Sakshi
Sakshi News home page

శ్రీదేవి బయోపిక్‌ తీయనున్న బోనీ !

Mar 7 2018 5:50 PM | Updated on Mar 7 2018 5:55 PM

Boney Kapoor to Make a Biopic on sridevi? - Sakshi

సాక్షి, ముంబై: ప్రముఖ నటి శ్రీదేవి గత నెల 24న దుబాయ్‌లో మరణించిన విషయం తెలిసిందే. ఆ షాక్‌ నుంచి కుటుంబ సభ్యులు ఇప్పుడిప్పుడే తెరుకుంటున్నారు. ప్రస్తుతం దివంగత నటి శ్రీదేవి జీవితం ఆధారంగా భర్త బోనీ కపూర్‌ డాక్యుమెంటరీ తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఇటీవల బోనీకపూర్‌.. డైరెక్టర్‌ శేఖర్‌ కపూర్‌ను సంప్రదించారట. శ్రీదేవి నటించిన ‘మిస్టర్‌ ఇండియా’కు శేఖర్‌ కపూర్‌ డైరెక్టర్‌గా చేశారు. ఈ చిత్రం బ్లాక్‌ బ్లాస్టర్‌ హిట్‌ కొట్టిన విషయం తెలిసిందే.

దీంతో ఆయనే బయోపిక్‌ తీయడానికి కరెక్ట్‌ అని బోనీ కపూర్‌ భావించారని తెలుస్తోంది. బోనీ కపూర్‌ నుంచి చిత్రంపై అధికారక ప్రకటన రావాల్సి ఉంది. కొద్దిరోజుల క్రితం వివాదాస్పద సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మ శ్రీదేవి బయోపిక్‌ తీస్తున్నారనే వార్తలు సోషల్‌ మీడియాలో వచ్చాయి. అయితే దీనిపై ఆయన స్పందించి.. నేను ఆమె జీవితంపై డాక్యుమెంటరీ తీయటం లేదని తెలిపారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement