నెక్ట్స్‌ ఏంటి? | Bommarillu Bhaskar to direct Akhil Akkineni | Sakshi
Sakshi News home page

నెక్ట్స్‌ ఏంటి?

Feb 19 2019 3:28 AM | Updated on Feb 19 2019 8:44 AM

 Bommarillu Bhaskar to direct Akhil Akkineni - Sakshi

డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థికి, ఒక సినిమా పూర్తి చేసిన హీరోకు తరచుగా వినిపించే ప్రశ్న నెక్ట్స్‌ ఏంటి?  ‘మిస్టర్‌ మజ్ను’ సినిమా తర్వాత అఖిల్‌ చేయబోయే నెక్ట్స్‌ సినిమా ఏంటి? అని ఇండస్ట్రీలో టాపిక్‌. అఖిల్‌ ముందు మూడు ఆప్షన్స్‌ ఉన్నాయని సమాచారం. ‘మలుపు’ దర్శకుడు సత్య ప్రభాస్‌తో ఓ స్పోర్ట్స్‌ సినిమా ఉందని ఒక వార్త. ‘బొమ్మరిల్లు’ భాస్కర్, ‘గీత గోవిందం’ దర్శకుడు పరశురామ్‌ కూడా అఖిల్‌కు కథ వినిపించారని సమాచారం. మరి ఈ ముగ్గురిలో తన నాలుగో ప్రాజెక్ట్‌ను ఈ అక్కినేని హీరో ఏ దర్శకుడితో చేస్తాడో వేచి చూడాలి. నెక్ట్స్‌ ఏంటి? అన్న ప్రశ్నకు ఈ నెలాఖరు లోపు సమాధానం రానుందట. దర్శకుడు ఎవరైనా బేనర్‌ మాత్రం గీతా ఆర్ట్స్‌ అని సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement